POCO F9 Series : కొత్త పోకో F9 సిరీస్ వచ్చేస్తోంది.. ప్రో, అల్ట్రా అదుర్స్, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!
POCO F9 Series : పోకో F9 అల్ట్రా గ్లాస్ ఫైబర్ ఫినిషింగ్‌తో డార్క్ చెర్రీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పోకో F9 ప్రో అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఈ పోకో ఫోన్ పూర్తి ఆఫర్లు, లాంచ్ వివరాలివే..
- Sreehari A
- Published on- August 26, 2026 / 08:23 PM IST
POCO F9 Series
- పోకో F9 ప్రో, పోకో F9 అల్ట్రాపై రెండు మోడళ్లు
- చైనాలో రెడ్‌మి K100 సిరీస్ మాదిరిగా ఉండవచ్చు
- పోకో F9 సిరీస్ సెప్టెంబర్ 1న గ్లోబల్ మార్కెట్లో లాంచ్
POCO F9 Series : షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో పోకో ఎఫ్9 ప్రో, పోకో ఎఫ్9 అల్ట్రా అనే 2 మోడళ్లు ఉండనున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు చైనాలో ప్రవేశపెట్టిన రెడ్‌మి K100 సిరీస్ కు అప్‌గ్రేడ్ వెర్షన్ అంటున్నారు. గత ఏడాదిలో లాంచ్ అయిన పోకో ఎఫ్8 ప్రో, పోకో ఎఫ్8 అల్ట్రాకు మరో అప్ గ్రేడ్ వెర్షన్ గా చెప్పొచ్చు. పోకో సిరీస్ ఫోన్ల ఫీచర్లు, లాంచ్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్స్ ఉంటాయని పోకో వెల్లడించింది. పోకో F9 అల్ట్రాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, పోకో F9 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5V చిప్‌సెట్ ఉంటాయి. పోకో F9 సిరీస్ అంతర్జాతీయంగా సెప్టెంబర్ 1న లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో ఒప్పో F9 ఉండే ఛాన్స్ లేదు.
Read Also : Oppo A7 Pro 5G Leak : బ్యాటరీలో బాహుబలి.. కొత్త ఒప్పో A7 ప్రో 5G ఫోన్ అదుర్స్, కీలక ఫీచర్లు లీక్!
పోకో ఎఫ్9 అల్ట్రా గ్లాస్ ఫైబర్ ఫినిషింగ్‌తో డార్క్ చెర్రీ కలర్ ఆప్షన్‌లో లభిస్తుందని పోకో తెలిపింది. పోకో ఎఫ్9 ప్రో అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్-ప్యానెల్ లూమినస్ డిజైన్ అందిస్తుంది.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
పోకో F9 ప్రో, పోకో F9 అల్ట్రా వరుసగా 2607APCA5G, 26077PC53G మోడల్ నంబర్లతో IMEI డేటాబేస్‌లో లిస్టు అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు సింగపూర్ IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కూడా అవే మోడల్ నంబర్లతో కనిపించాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు కనెక్టివిటీ కోసం 5జీ, బ్లూటూత్, Wi-Fi NFC ఆప్షన్‌లతో రానున్నాయి.
గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన పోకో F8 అల్ట్రాలో 6.9-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే (1,200 x 2,608 పిక్సెల్స్) ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ 3,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్స్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కెమెరాలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, కెమెరా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 6,500mAh బ్యాటరీ, 100W హైపర్‌ఛార్జ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
