Oppo A7 Pro 5G Leak : బ్యాటరీలో బాహుబలి.. కొత్త ఒప్పో A7 ప్రో 5G ఫోన్ అదుర్స్, కీలక ఫీచర్లు లీక్!
Oppo A7 Pro 5G Leak : ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కావచ్చు. ఒప్పో A7 ప్రో 5జీ ఫోన్ 6.57-అంగుళాల డిస్ప్లేతో వస్తుందని అంచనా.
Oppo A7 Pro 5G Leak
- ఒప్పో A7 ప్రో 5జీ క్యాప్సూల్ షేప్ కెమెరా మాడ్యూల్ అంచనా
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.57 అంగుళాల డిస్ప్లే ఉండొచ్చు
- ఒప్పో A7 ప్రో 5జీలో 8,000mAh బ్యాటరీ ఉండొచ్చు
Oppo A7 Pro 5G Leak : ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. చైనాకు తయారీదారు ఒప్పో ఇటీవలే ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో అతి త్వరలో ఒప్పో A7 ప్రో 5జీ కూడా లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ పలు సర్టిఫికేషన్ సైట్లలో లిస్టు అయింది. ఒప్పో A7 ప్రో 5జీలో క్యాప్సూల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉండవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కావచ్చు. ఒప్పో A7 ప్రో 5జీలో 6.57-అంగుళాల డిస్ప్లే ఉంటుందని అంచనా. మీడియా రిపోర్టు ప్రకారం.. ఒప్పో A7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ బ్రెజిల్ నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఏజెన్సీ (ANATEL)లో CPH2931 మోడల్ నంబర్‌తో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రౌన్ కలర్ సెటప్‌తో వస్తుంది.
చైనాలో ఆవిష్కరించిన ఒప్పో A7 ప్రో మాక్స్ కన్నా సరికొత్త డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్యాప్సూల్ ఆకారంలో కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరా మాడ్యూల్లో 2 కెమెరాలు రింగ్ షేప్ ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి.
ఒప్పో A7 ప్రో 5జీ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ( లీక్) :
ఒప్పో A7 ప్రో 5జీ ఫోన్ 8,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో థాయ్‌లాండ్ నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) వెబ్సైట్లో మలేషియా SIRIM సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించింది. ఒప్పో A7 ప్రో 5జీ ఫోన్ 8GB ర్యామ్, 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ 6.57-అంగుళాల డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు.
ఇటీవల చైనాలో లాంచ్ అయిన ఒప్పో A7 ప్రో మ్యాక్స్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ టాప్ బ్రైట్నెస్ 6.78-అంగుళాల ఫుల్-HD+ అమోల్డ్ డిస్ప్లే (1,272 x 2772 పిక్సెల్స్)తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఒప్పో A7 ప్రో మ్యాక్స్ బ్యాక్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. సెన్సార్లలో ఇ-కంపాస్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ గైరోస్కోప్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 10,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
