Poco M8s Launch : పోకో ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఖతర్నాక్ ఫీచర్లతో పోకో M8s వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Poco M8s Launch : భారత మార్కెట్లో ఈ ఏడాది ప్రారంభంలో పోకో M8 విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ సిరీస్‌కు త్వరలో పోకో M8s కూడా లాంచ్ కానుంది. పూర్తి వివరాలివే..

Poco M8s Launch

  • పోకో M8s NBTC వెబ్‌సైట్‌లో కనిపించింది
  • రాబోయే పోకో M8s ఫోన్ ధర పోకో M8 కన్నా తక్కువే
  • ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో పోకో M8 లాంచ్
  • కొత్త స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రానుంది.

Poco M8s Launch : పోకో నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ పోకో M సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో పోకో ఎం8 లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. పోకో M8లో 5,520mAh బ్యాటరీ ఉంది. ఈ సిరీస్‌లో త్వరలో పోకో M8s కూడా చేరనుంది.

పోకో M8s, థాయ్‌లాండ్ నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) వెబ్‌సైట్‌లో పోకో 26067PC09G అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4G, 5G, NR, GSM కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఈ లిస్టు ప్రకారం.. పోకో M8s చైనాలో తయారైంది. B38253-26 అనే సర్టిఫికేషన్ నంబర్‌తో వస్తుంది.

పోకో M8 ప్రోతో పాటు రాబోయే స్మార్ట్‌ఫోన్ ధర పోకో M8 కన్నా తక్కువగా ఉంటుందని అంచనా. భారత మార్కెట్లో పోకో M8 5జీ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 18,999, 8GB + 128GB వేరియంట్‌కు రూ. 19,999, 8GB + 256GB వేరియంట్‌కు రూ. 21,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రాస్ట్ సిల్వర్, గ్లేసియర్ బ్లూ, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Redmi A7 Pro Launch : 6300mAh బ్యాటరీ, డ్యూయల్ AI కెమెరాలతో కొత్త రెడ్‌మి A7 ప్రో 5G వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే?

పోకో M8s స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
పోకో M8లో 6.77-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,392 పిక్సెల్స్) 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2.0పై రన్ అవుతుంది. పోకో M8 5జీ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K రిజల్యూషన్ వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

పోకో M8 ఫోన్ 5,520mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4 ఏళ్ల OS అప్‌గ్రేడ్‌, 6 ఏళ్ల సెక్యూరిటీని అందిస్తుంది.