Redmi A7 Pro Launch : 6300mAh బ్యాటరీ, డ్యూయల్ AI కెమెరాలతో కొత్త రెడ్మి A7 ప్రో 5G వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే?
Redmi A7 Pro Launch : రెడ్ మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. ఈ నెల 13నే భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రెడ్మి A7 ప్రో 5జీ 32MP డ్యూయల్ కెమెరాతో వస్తోంది. AI ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందని అంచనా. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Redmi A7 Pro Launch
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా
ఈ ఫోన్లో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,300mAh బ్యాటరీ
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది
Redmi A7 Pro Launch : కొత్త రెడ్మి ఫోన్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 13న భారత మార్కెట్లో రెడ్మి A7 ప్రో 5G లాంచ్ కానుంది. ఈ ఫోన్లో 6.9-అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. ఈ ఎల్సీడీ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
కంపెనీ ఈ ఫోన్లో ఆక్టా-కోర్ 5G చిప్సెట్ అందించింది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 6300mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో వస్తుంది. రెడ్మి A7 ప్రో 5జీ లాంచ్ ముందే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో రెడ్మి A7 ప్రో 5జీ లాంచ్ తేదీ :
రెడ్మి A7 ప్రో 5జీ ఫోన్ ఏప్రిల్ 13 సోమవారం రోజున భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్, అమెజాన్‌లో కూడా టీజ్ చేసింది. ఇందుకోసం కంపెనీ ఒక స్పెషల్ మైక్రోసైట్‌ను లైవ్‌స్ట్రీమ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
భారత్‌లో రెడ్మి A7 ప్రో 5జీ ధర :
రెడ్మి A7 ప్రో 5జీ ధర ఇంకా వెల్లడి కాలేదు. లీకుల ప్రకారం.. బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 10వేలు ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 13వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్, కంపెనీ ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసిన రెడ్మి A7 ప్రో 4Gకి అప్‌గ్రేడ్ వెర్షన్ కానుంది.
రెడ్మి A7 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు :
రెడ్మి A7 ప్రో 5జీ ఫోన్ అన్ని మెయిన్ స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్లో 6.9-అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. LCD ప్యానెల్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్లో అతిపెద్ద డిస్ప్లే ఉంటుందని కంపెనీ పేర్కొంది.
కంపెనీ ఇంకా ప్రాసెసర్‌ను వెల్లడించలేదు. కానీ, ఇందులో ఆక్టా-కోర్ 5జీ చిప్సెట్ ఉంటుందని వెల్లడైంది. బేస్ వేరియంట్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్లో 128GB స్టోరేజ్‌తో వేరియంట్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ 16, హైపర్ఓఎస్ 3 స్కిన్‌తో వస్తుంది.
రెడ్మి A7 ప్రో 5జీలో ఏఐ ఫీచర్లతో 32MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,300mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
