×
Ad

Poco X7 Pro : పోకో ఫ్యాన్స్ మీకోసమే.. ఈ పోకో X7 ప్రో మీ బడ్జెట్ ధరలోనే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇంత తక్కువకు మళ్లీ రాదు!

Poco X7 Pro : పోకో X7 ప్రో ఏకంగా రూ. 4వేలు తగ్గింది. పోకో ఎక్స్ 8 లాంచ్ కు ముందే ఈ ప్రో మోడల్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేయొద్దు.

Poco X7 Pro

  • పోకో X7 ప్రోపై రూ.4వేలు తగ్గింపు, కార్డ్ ఆఫర్లతో ధర రూ.23వేలు మాత్రమే
  • ఎక్స్ఛేంజ్ బోనస్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో
  • 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ చిప్, 50MP కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ బ్యాటరీ

Poco X7 Pro : కొత్త పోకో ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో పోకో నుంచి సరికొత్త పోకో X8 సిరీస్‌ రాబోతుంది. అంతకంటే ముందే పోకో ఫ్యాన్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత జనరేషన్ పోకో X7 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

ప్రస్తుత ఈ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్లు, కార్డ్ ఆఫర్లతో కొనుగోలుదారులు రూ. 23వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X7 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పోకో X7 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X7 ప్రో రూ.23,999 తగ్గింపు ధరకు లభ్యమవుతోంది. అసలు లాంచ్ ధర రూ.27,999 కన్నా రూ.4వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,200 అదనపు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. తద్వారా ఫోన్ ఫైనల్ ధర రూ.22,799 అవుతుంది.

కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా గరిష్టంగా రూ.22,850 వరకు పొందవచ్చు. అయితే, పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ నెలకు కేవలం రూ.4వేల నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.

Read Also : Vivo V60 5G : వారెవ్వా.. వండర్‌ఫుల్ ఆఫర్.. వివో V60 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

పోకో X7 ప్రో స్పెసిఫికేషన్లు :

పోకో X7 ప్రో ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాదు.. మెరుగైన ఫొటో క్వాలిటీ కోసం డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+ సపోర్టు ఇస్తుంది. కంపెనీ ప్రకారం ఈ ఫోన్ 1400 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కూడా చేరుకోగలదు.

హుడ్ కింద, ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమన్షిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. హైపర్ఓఎస్ 2తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, ఫొటోల కోసం 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరా కూడా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ లెదర్ మాదిరిగా స్టైలిష్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌తో వస్తుంది. అదనపు సెక్యూరిటీ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ గొరిల్లా గ్లాస్ 7iతో వస్తుంది. బ్యాటరీ పరంగా, 6,550mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 90W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.