POCO X8 Series Sale : 10000mAh బ్యాటరీతో 2 కొత్త పోకో ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే కొనేసుకోండి.!

POCO X8 Series Sale : పోకో నుంచి రెండు కొత్త ఫోన్లు వచ్చేశాయి.. 10000mAh బ్యాటరీతో ఈ ఫోన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.. ఈ ఫస్ట్ సేల్ సమయంలో కొన్నారంటే భారీగా తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

  • Published on- September 13, 2026 / 08:57 PM IST

POCO X8 Series Sale

  • గత వారమే భారత మార్కెట్లో పోకో ఎక్స్8 సిరీస్ లాంచ్
  • 10,000mAh వరకు బ్యాటరీతో కంపెనీ ఫస్ట్ సిరీస్ ఇదే
  • ఫస్ట్ సేల్‌లో పోకో ఫోన్లపై వేల రూపాయలు ఆదా చేయొచ్చు

POCO X8 Series Sale : పోకో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్లు.. భారత మార్కెట్లో పోకో ఎక్స్8 సిరీస్ సేల్ మొదలైంది. గత వారమే పోకో ఎక్స్8, పోకో ఎక్స్8 పవర్ రెండు ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్‌లు భారీ బ్యాటరీలతో ఆకట్టుకునేలా ఉన్నాయి. పోకో ఈ సిరీస్‌లోని ఫస్ట్ ఫోన్‌ను 10,000mAh బ్యాటరీతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫస్ట్ సేల్‌లో కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై అదిరిపోయే డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది.. పూర్తి డీల్ వివరాలివే..

ఫస్ట్ సేల్ ఆఫర్లు :
పోకో X8 ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB ఉన్నాయి. ప్రారంభ ధర రూ. 29,999 నుంచి లభిస్తుంది. మిగిలిన రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 32,999, రూ. 35,999కు లభిస్తున్నాయి. ఫైరీ ఆరెంజ్, బ్లాక్, ఫ్రాస్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

పోకో ఎక్స్8 పవర్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB అందిస్తుంది. ప్రారంభ ధర రూ. 35,999 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 38,999గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ పోకో సిరీస్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ల కొనుగోళ్లపై రూ. 2వేలు కూపన్, రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

పోకో X8, పోకో X8 పవర్ ఫీచర్లు :
ఈ రెండు పోకో ఫోన్‌లలోనూ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+కు సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్ 1280 x 2772 పిక్సెల్స్, టాప్ బ్రైట్‌నెస్ 3500 నిట్స్ వరకు ఉంటుంది. IP66 + IP68 + IP69, IP69K రేటింగ్‌లకు సపోర్ట్ చేస్తాయి. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

Read Also : OPPO K14 Lite : ధర చూస్తే వావ్.. బ్యాటరీ చూస్తే డబుల్ వావ్! ఒప్పో చీపెస్ట్ ఫోన్ ఇదిగో..!

పోకో ఎక్స్8 పవర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. పోకో ఎక్స్8 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ రెండు ఫోన్‌లు 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్‌తో వస్తాయి.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతాయి. పోకో ఎక్స్8 పవర్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. మరోవైపు, పోకో X8 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9,000mAh బ్యాటరీ అందిస్తుంది.

ఈ రెండు ఫోన్‌లలోనూ డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. పోకో X8లో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇందులో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. పోకో X8 పవర్‌లో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.