Realme 10 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. రాబోయే నెలల్లో భారత మార్కెట్లోకి రియల్‌మి (Realme) నుంచి Realme 10 Series స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు (GSM Arena)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో Realme India CEO మాధవ్ షేత్ ధ్రువీకరించారు. 2022 ద్వితీయార్థంలో రియల్‌మి కంపెనీ సుమారు రూ. 10వేల నుంచి రూ. 15వేల ధరలో 5G ఫోన్లను లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. భారత మార్కెట్లో 5G నెట్ వర్క్ కన్నా ముందే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు.
ప్రస్తుతం.. దేశంలో 5G రేడియో తరంగాల కోసం బిడ్డింగ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో 5G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Realme కంపెనీ ఇప్పటికే Realme 9 సిరీస్ కింద అనేక స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్‌మి పోర్ట్‌ఫోలియోలో Realme 9i (రూ. 13,499), Realme 9 5G (రూ. 15,999), Realme 9 (రూ. 17,999), Realme Pro 5G (రూ. 18,999), Realme 9 5G స్పీడ్ ఎడిషన్ (రూ. 99+ 19,9,9,99,9 ) వంటి అనేక మోడళ్లను ప్రవేశపెట్టింది. రాబోయే రియల్‌మి 10 సిరీస్ ధర దాదాపు అదే రేంజ్లో ఉంటుందని భావించవచ్చు.
అయితే కొన్ని మోడల్‌లు రూ. 20,000 ధరపైనే ఉండవచ్చు. Realme 9 Pro+ 5G మోడల్ వేరియంట్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కెమెరాలతో వచ్చింది. ఈ కొత్త సరసమైన 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. చిప్సెట్ కొరత, పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం కారణంగా రియల్‌మి 10 సిరీస్ ఫోన్ లాంచ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్లో రియల్‌మి రెండు-మూడు కొత్త కేటగిరీలలోకి రానుందని సీఈఓ తెలిపారు. ఇటీవలే దేశంలో మొదటి మానిటర్‌ను కేవలం రూ. 12,999కి రియల్‌మి లాంచ్ చేసింది. Full-HD రిజల్యూషన్‌తో 75Hz డిస్ప్లేను అందిస్తుంది. మానిటర్ ఆధునిక స్టాండ్, స్లిమ్ బెజెల్స్‌తో వచ్చింది. రియల్‌మి టెక్ లైఫ్ బ్రాండింగ్ కింద రియల్మే చాలా హోమ్-ప్రొడక్ట్‌లను లాంచ్ చేసింది. చాలా టెక్ బ్రాండ్లు కొత్త డివైజ్‌లను దీపావళి (అక్టోబర్ 24)కి ముందే లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.
Read Also : Realme Pad X India : రియల్‌మి నుంచి Pad X ఇండియా టాబ్లెట్ వస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లోనే సేల్!