Realme 16 5G : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి 16 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. అతి చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి..!
Realme 16 5G : భారత మార్కెట్లో రియల్‌మి 16 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. గత వారమే భారత మార్కెట్లో లాంచ్ కాగా ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. ధర, స్పెషిఫికేషన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published On : April 6, 2026 / 09:14 PM IST
Realme 16 5G
- రియల్‌మి 16 5జీ 6.5-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే
- 50MP ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్
- 7,000mAh బ్యాటరీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
Realme 16 5G : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? ఇటీవలే భారత మార్కెట్లో రియల్‌మి 16 5G ఫోన్ లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్ అమ్మకానికి వచ్చింది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
7000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. రియల్‌మి 16 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మి 16 5జీ ధర :
రియల్‌మి 16 5జీ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 కాగా , 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999గా ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.
రియల్‌మి 16 5జీ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 16 5జీ ఫోన్ 2372×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.5-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ 5జీ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7,000mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందిస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. రియల్‌మి 16 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.4 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ రియల్‌మి ఫోన్ 15.83 సెం.మీ పొడవు, 7.51 సెం.మీ వెడల్పు, 0.81 సెం.మీ మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, బ్లూటూత్ 5.3, 4G ఎల్టీఈ, జీపీఎస్, Wi-Fi 6, ఒక USB టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
