Realme 16x 5G Sale : 7000mAh బ్యాటరీతో రియల్‌మి రచ్చ! కొత్త 16x 5G సేల్ స్టార్ట్.. ధర చూస్తే షాక్!
Realme 16x 5G Sale : భారత మార్కెట్లో రియల్‌మి 16x 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 45W ఛార్జింగ్‌తో వస్తుంది. ధర రూ. 25,999 నుంచి అందుబాటులో ఉంటుంది.
- Sreehari A
- Published on- August 13, 2026 / 03:45 PM IST
Realme 16x 5G Sale
- రియల్‌మి 16x 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ. 25,999 మాత్రమే
- ఈ ఫోన్‌లో 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్
- 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే సెటప్, ఎక్స్ఛేంజ్ బోనస్
Realme 16x 5G Sale : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? రియల్‌మి 16x 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ ఫోన్ ఇటీవలే రూ. 30వేల లోపు ధరలో లాంచ్ అయింది. ఫీచర్ల పరంగా చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300, 6nm ప్రాసెసర్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ, 50MP మెయిన్ బ్యాక్ కెమెరా, IP65 రేటింగ్ అందిస్తుంది. రియల్‌మి 16x 5జీ ఫోన్ ధర, లాంచ్ ఆఫర్లు, స్పెసిఫికేషన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
రియల్‌మి 16x 5జీ ధర, ప్రారంభ ఆఫర్లు :
రియల్‌మి 16x 5జీ ఫోన్ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999, 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999, 6GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది. ఈ ఫోన్ గ్లోరీ వైట్ ఎండ్యూరెన్స్ బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొనేసుకోవచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్, రూ. 2వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
Read Also : OnePlus 13 : ఆఫర్ అదుర్స్ మావా.. వన్‌ప్లస్ 13పై ఏకంగా రూ. 11వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
రియల్‌మి 16x 5జీ స్పెసిఫికేషన్లు :
రియల్‌మీ 16x 5జీ ఫోన్ 6.8-అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 1570×720 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అందిస్తుంది.
ఈ స్టోరేజీని 2TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ఉంది. కెమెరా సెటప్ పరంగా చూస్తే.. రియల్‌మి16x 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
సేఫ్టీ విషయానికి వస్తే..
ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కొలతల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 166.47 మిమీ పొడవు, 78.2 మిమీ వెడల్పు, 8.88 మిమీ మందం ఉంటుంది. బరువు 217 గ్రాములు ఉంటుంది.
ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ మన్నిక కోసం MIL-STD 810H సర్టిఫికేషన్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్ 4జీ VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి 2.0 పోర్ట్ ఉన్నాయి.
