Realme 16x : కొత్త రియల్‌మి 16x వచ్చేస్తోందోచ్.. BIS లిస్టింగ్‌తో టెక్ మార్కెట్‌లో హీట్.. ఫీచర్లపై భారీ అంచనాలు!
Realme 16x : రాబోయే స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్‌తో పాటు 6GB + 256GB ఆప్షన్‌తో వస్తుందని అంచనా. రియల్‌మి 15ఎక్స్ కు అప్ గ్రేడ్ వెర్షన్. బీఐఎస్ సైటులో లిస్ట్ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published on- May 7, 2026 / 07:13 PM IST
Realme 16x India
- రియల్‌మి 16x ఫోన్ వివరాలు BIS సైటులో లిస్టింగ్
- ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు
- గత ఏడాదిలో వచ్చిన రియల్‌మి 15ఎక్స్ కు అప్‌గ్రేడ్ వెర్షన్
Realme 16x : రియల్‌మి ఫ్యాన్స్‌కు అద్భుతమైన న్యూస్.. రియల్‌మి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. అతి త్వరలో భారత మార్కెట్లో రియల్‌మీ 16x లాంచ్ కావచ్చు. కొన్ని లీక్‌లను పరిశీలిస్తే.. రియల్‌మి 16x స్పెసిఫికేషన్‌లను ముందుగానే వెల్లడించాయి. రియల్‌మి 15ఎక్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది.
మీడియా రిపోర్టు ప్రకారం.. :
RMX5270 మోడల్ నంబర్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. రియల్‌మి 16x పేరుతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే, ఈ లిస్టులో రియల్‌మి 16x స్పెసిఫికేషన్లు ఇంకా రివీల్ చేయలేదు.
4జీబీ ర్యామ్, 128GB స్టోరేజ్‌తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో (6GB+256GB) ఆప్షన్ కూడా లభిస్తుంది. గత ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన రియల్‌మి 15ఎక్స్ 5జీ, 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ 1,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.8-అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (1,570×720 పిక్సెల్స్) అందిస్తుంది.
ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి-G57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. రియల్‌మి 15x రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మి 15xలో 7,000mAh బ్యాటరీ ఉంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
అద్భుతమైన ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. గత నెలలో లాంచ్ అయిన రియల్‌మి 16 5జీలో 6.57-అంగుళాల ఫుల్ HD+ (1,080×2,372 పిక్సెల్స్) ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది.
120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 4,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్స్ ఉన్నాయి. ఈ డిస్‌ప్లే డీటీ స్టార్ డీ ప్లస్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్ మాలి-G57 ఎంసీ2 జీపీయూతో రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంటుందని అంచనా.
