Realme 17 Pro Launch : ఇది కదా ఫోన్ అంటే.. 10,000mAh బ్యాటరీతో రియల్‌మి కొత్త ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ముందే లీక్..!

Realme 17 Pro Launch : రియల్‌మి 17 ప్రో త్వరలో లాంచ్ కానుంది. 10,000mAh బ్యాటరీ, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 50MP కెమెరాతో ఈ ఫోన్ రాబోతుంది.. ఫీచర్లు, ధర వివరాలివే..

Realme 17 Pro Launch

  • 10,000mAh బ్యాటరీతో రియల్‌మి 17 ప్రో ఫోన్
  • రియల్‌మి 17 ప్రోలో అదిరిపోయే ఫీచర్లు
  • 120Hz అమోల్డ్ డిస్‌ప్లే అదుర్స్ 
  • రియల్‌మి 17 ప్రో లీక్ స్పెసిఫికేషన్లు

Realme 17 Pro Launch : రియల్‌మి లవర్స్ మీకోసమే.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త ఫోన్ సందడి చేసేందుకు రెడీ అవుతోంది.. ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మి 17 సిరీస్‌ నవంబర్ 9న మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది..

ఈ సిరీస్‌లో హైఎండ్ మోడల్‌గా రియల్‌మి 17 ప్రో రానుంది. అయితే, రియల్‌మి ఫోన్ లాంచ్ కాకముందే సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. భారీ 10,000mAh బ్యాటరీ ఉంటుందనే ఇప్పుడు టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది..

అదిరిపోయే డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
లీకైన వివరాల ప్రకారం.. రియల్‌మి 17 ప్రోలో 1.5K రిజల్యూషన్‌తో అమోల్డ్ డిస్‌ప్లే ఉండనుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అందిస్తుంది. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ వంటి టాస్కులు మరింత స్మూత్‌గా ఉండొచ్చ.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో రావొచ్చు..

Read Also : iQOO Z12S Launch : ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్.. 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?

బ్యాటరీ విషయంలో తగ్గేదేలే.. :
ఈ ఫోన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ఫీచర్ బ్యాటరీ.. ఏకంగా 10,000mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీని అందించవచ్చునని లీకులు చెబుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే, ఛార్జింగ్ స్పీడ్, బ్యాటరీ బ్యాకప్‌పై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..

కెమెరాలతో స్పెషల్ :
ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఇవ్వవచ్చని అంచనా.. 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండొచ్చట. సెల్ఫీల కోసం 32MP లేదా 50MP ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది..

ఇక ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 లేదా IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు.. ఆండ్రాయిడ్ 17 ఆధారిత రియల్‌మి యూఐతో ఈ ఫోన్ రావచ్చని అంచనా..

ఇదే సిరీస్‌లో రియల్‌మి 17 ప్రో ప్లస్ మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏకంగా 200MP కెమెరా, ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండవచ్చని లీకులు చెబుతున్నాయి. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి లీకైన వివరాలే.. అసలు ఫీచర్లు, ధర, ఇతర వివరాలపై నవంబర్ 9న కంపెనీ అధికారిక ప్రకటనతో క్లారిటీ రానుంది..