Realme: ఈ ఫోన్ వాడేవారికి గుడ్ న్యూస్

రియల్‌ మీ సీ3 స్మార్ట్‌ ఫోన్‌ను వాడుతున్నారా.. అయితే ఈ అప్‌డేట్ మీ కోసమే.. దీని కోసం లేటెస్ట్‌గా ఆండ్రాయిడ్‌ 11 స్టేబుల్‌ వెర్షన్‌ విడుదలైంది. చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ రియల్‌ మీ సీ3ని 2020 ఫిబ్రవరి 14న విడుదల చేసింది.

Realme C3 (1)

Realme C3: రియల్‌ మీ సీ3 స్మార్ట్‌ ఫోన్‌ను వాడుతున్నారా.. అయితే ఈ అప్‌డేట్ మీ కోసమే.. దీని కోసం లేటెస్ట్‌గా ఆండ్రాయిడ్‌ 11 స్టేబుల్‌ వెర్షన్‌ విడుదలైంది. చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ రియల్‌ మీ సీ3ని 2020 ఫిబ్రవరి 14న విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన సీ2 కి భారీ రెస్పాన్స్‌ రావడంతో సీ3ని మార్కెట్లోకి తెచ్చింది.

ఈ ఫోన్‌ కోసం జులైలో బీటా వెర్షన్‌ విడుదల చేసినా లేటెస్ట్‌గా స్టేబుల్‌ వెర్షన్‌ను రియల్‌ మీ ప్రతినిధులు అధికారికంగా విడుదల చేశారు. ఈ అప్‌డేట్‌‌తో ఫోన్‌లో టెక్నికల్‌ సమస్యలతో పాటు కేటగిరి, సిస్టమ్‌, ఈజీ మొబైల్‌ ఇంటర్‌‌ఫేస్‌ ఆప్టిమైజేషన్‌, సెక్యూరిటీ ప్రైవసీ, గేమ్స్‌ ఇలా ఒక్కటేమిటీ రియల్‌ సీ3 వెర్షన్‌ ఫోన్ అంతా ఛేంజ్ అయిపోయినట్లే. అంటే స్టోరేజిలో ఫైల్స్ పోకుండా దాదాపు కొత్త ఫోన్ చేతికొచ్చినట్లే.

రియల్ మీ సీ3 స్పెసిఫికేషన్లు ఇలా:
* 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
* 89.8 పర్సెంట్‌ తో స్క్రీన్ టు బాడీ రేషియో
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 10 రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టం
* 12 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరాలు
* హెచ్‌డీఆర్, నైట్ స్కేప్, క్రోమా బూస్ట్, స్లో మోషన్, పోట్రెయిట్ మోడ్ ఫీచర్‌
* హెచ్ డీఆర్, ఏఐ బ్యూటిఫికేషన్, పానోరమిక్ వ్యూ, టైమ్ ల్యాప్స్ ఫీచర్లతో 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.