Best Jio Plans: పండగ చేస్కోండి.. జియో 3 చీపెస్ట్ ప్లాన్లు.. రూ. 155 కన్నా తక్కువే.. 28 రోజుల వ్యాలిడిటీ, భారీ డేటా బెనిఫిట్స్
Best Jio Plan : జియో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? డెయిలీ డేటా, కాలింగ్ బెనిఫిట్స్ కోసం ఈ చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై ఓసారి లుక్కేయండి..
Best Jio Plans
- రిలయన్స్ జియో అతి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే
- డెయిలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్
- రూ. 155 నుంచి ప్రారంభ రీఛార్జ్ ప్లాన్లు
Best Jio Plans : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అత్యంత సరసమైన ధరకే జియో రీఛార్జ్ పాన్లు అందుబాటులో ఉన్నాయి. చీపెస్ట్ జియో ఫోన్ ప్లాన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ఈ జియో చౌకైన ప్లాన్ల ధర రూ. 155 కన్నా తక్కువే.
మీరు జియో యూజర్ అయితే ఈ రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటాను పొందవచ్చు. జియో పోర్ట్‌ఫోలియో రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్‌తో అనేక రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 155 నుంచి అత్యంత సరసమైన జియో ఫోన్ ప్లాన్లను ఎంచుకోవచ్చు.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
జియో ఫోన్ ప్రైమా రూ. 152 ప్లాన్ :
ఈ జియో ఫోన్ ప్రైమా ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇంటర్నెట్ కోసం మీరు రోజుకు 0.5GB డేటాను పొందవచ్చు. యాక్టివ్ ప్లాన్‌తో కంపెనీ అదనంగా 1GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు.
Read Also : Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే!
ఫ్రీ కాలింగ్, జియో టీవీ :
ఈ జియో ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ అందిస్తుంది. కంపెనీ 300 ఫ్రీ SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ జియో టీవీకి ఫ్రీ యాక్సెస్, జియో క్లౌడ్‌లో ఫ్రీ స్టోరేజీని కూడా అందిస్తుంది.
జియో ఫోన్ ప్రైమా రూ. 125 ప్లాన్ :
ఈ జియో ఫోన్ ప్రైమా ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇంటర్నెట్ వినియోగం కోసం రోజుకు 0.5GB డేటాను పొందుతారు. డేటా లిమిట్ తర్వాత స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది. అలాగే, అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. 300 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ జియో టీవీకి ఫ్రీ యాక్సెస్, జియో క్లౌడ్‌లో ఫ్రీ స్టోరేజీ కూడా అందిస్తుంది.
జియో ఫోన్ ప్రైమా రూ. 91 ప్లాన్ :
ఈ జియో ఫోన్ ప్రైమా ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇంటర్నెట్ వినియోగం కోసం మీరు రోజుకు 100MB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 200MB డేటాను కూడా అందిస్తుంది.
ఫ్రీ కాలింగ్, జియో టీవీ :
ఈ జియో ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ 50 ఫ్రీ SMS కూడా అందిస్తుంది. జియో టీవీకి ఫ్రీ యాక్సెస్, జియో క్లౌడ్‌లో ఫ్రీ స్టోరేజీని కూడా అందిస్తుంది.
