Realme : ల్యాప్‌‌టాప్ ఫుల్ మెటల్ బాడీ, టూల్ కిట్‌‌తో టెస్టు చేసుకోవచ్చు

స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్ టాప్‌లపై దృష్టి సారించాయి. ఇందులో ‘రియల్ మీ’ కూడా ఉంది. ఆగస్టు 18వ తేదీన దీనిని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది

Realme

Realme Laptop : కంపెనీలను తమ ప్రొడక్ట్ ను మార్కెట్ లో విడుదల చేసే క్రమంలో వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తుంటాయి. ప్రముఖులు, సెలబ్రెటీల చేత ప్రచారం నిర్వహిస్తుంటే..మరికొన్ని కంపెనీలు..వినూత్న పద్ధతులు ఎంచుకుంటున్నాయి. తాజాగా ల్యాప్ టాప్ ను మార్కెట్ లో విడుదల చేసే కార్యక్రమంలో…ఓ కంపెనీ చేసిన ఆహ్వానం చూసి ఆశ్చర్యపోయారు. నచ్చిన టూల్ తో ల్యాప్ టాప్ ను టెస్టు చేసుకోవచ్చని ఆహ్వానంలో వెల్లడించింది. ఈ విషయాన్ని రంజిత్ అనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Read More : Ola Bike: నేడే ఓలా బైక్ విడుదల.. ధర ఎంతంటే?

అసలు విషయం ఏంటీ ?

కరోనా కారణంగా కంప్యూటర్లకు, ల్యాప్ టాప్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వర్క్ ఫ్రం హోమ్ ఉండడంతో చాలా మంది ల్యాప్ టాప్ ల వైపు మొగ్గు చూస్తున్నారు. దీంతో ఆయా కంపెనీల అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ల్యాప్ టాప్ లపై దృష్టి సారించాయి. ఇందులో ‘రియల్ మీ’ కూడా ఉంది. ఆగస్టు 18వ తేదీన దీనిని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ల్యాప్ టాప్ ఫుల్ గా మెటల్ బాడీతో ఉండనున్నట్లు, అందులో భాగంగా పలువురు టెక్నికల్ నిపుణులకు కంపెనీ ఆహ్వానం పలికింది.

Read More : PM Modi : బాలికలకు గుడ్ న్యూస్, ఇక సైనిక్ స్కూళ్లలో ఎంట్రీ

ఆహ్వానంలో ఓ టూల్ కిట్ : –
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ టెక్నికల్ ఎక్స్ పర్ట్ రంజిత్ కు కూడా ఆహ్వానం అందింది. ఆహ్వానంలో భాగంగా..రంజిత్ కు ఓ టూల్ కిట్ కూడా పంపింది. టూల్ కిట్ లో నచ్చిన టూల్ తో ల్యాప్ టాప్ ను టెస్టు చేసుకోవచ్చని సూచించింది రియల్ మీ. ఇదే విషయాన్ని రంజిత్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ విధంగా లాంచ్ చేయం ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు.