Reliance Jio : పండగ చేస్కోండి.. జియో వార్షికోత్సవ ప్లాన్లు.. 20GB వరకు ఫ్రీ డేటా, ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్..
Jio Anniversary Special Plan : జియో వార్షికోత్సవ స్పెషల్ ప్లాన్‌లో 20GB వరకు ఫ్రీ డేటా, ఓటీటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Jio Anniversary Special Plan
Reliance Jio Anniversary Special Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ప్రత్యేకించి జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. కాలింగ్, డేటా మాత్రమే కాకుండా, OTT, గేమింగ్, క్లౌడ్ స్టోరేజ్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. అదనపు డేటా, ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వంటి ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తోంది.
జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం చీపెస్ట్ డేటా, కాలింగ్ (Jio Anniversary Special Plan) మాత్రమే కాదు.. రోజువారీ హై-స్పీడ్ డేటా, OTT సబ్‌స్క్రిప్షన్, క్లౌడ్ స్టోరేజ్, గేమింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం కంపెనీ కొన్ని ప్లాన్‌లపై అదనపు డేటా, మరెన్నో ఆఫర్‌లను అందిస్తోంది.
ప్రస్తుతం జియో ఫోన్ కాల్స్, SMS, OTT సబ్‌స్క్రిప్షన్ కోసం ఎక్కువగా డేటాను యూజర్లు వాడేస్తున్నారు. అందులో వర్క్ ఫ్రమ్ హోం, పిల్లల ఆన్‌లైన్ చదువులకు, సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను చూసేందుకు ప్రతి ఒక్కరికీ ఎక్కువ డేటా అవసరం. అందుకే అదనపు డేటాను అందించే ప్లాన్‌లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
రూ. 899 ప్లాన్‌లో 20GB ఫ్రీ డేటా :
జియో రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటాతో పాటు 20GB అదనపు డేటా ఉచితంగా పొందవచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు అయితే 3 నెలల పాటు టెన్షన్ లేకుండా డేటా, కాలింగ్ పొందవచ్చు.
Read Also : Samsung Galaxy A55 5G : వారెవ్వా.. ఈ శాంసంగ్ 5G ఫోన్ చాలా చీప్ గురూ.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
జియో 9వ వార్షికోత్సవం స్పెషల్ ప్లాన్లు :
ప్రస్తుతం జియో 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జియో తమ యూజర్లకు అనేక అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్‌లో 2 నెలల పాటు జియోహోమ్ ఫ్రీ ట్రయల్, జియోహాట్‌స్టార్ ఫ్రీ మొబైల్, టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ నుంచి ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడంపై రూ.399 తగ్గింపు కూడా పొందవచ్చు. జియోసావ్న్, జొమాటో, నెట్‌మెడ్స్, 50GB జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి సర్వీసుల ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
రూ. 555 గేమింగ్ ప్లాన్‌లో బోనస్ డేటా :
రూ.555 ప్లాన్ గేమర్స్‌కు బెస్ట్. రోజువారీగా 2GB డేటాతో పాటు, 5GB అదనపు డేటా ఉచితంగా అందిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, బీజీఎంఐ కూపన్లు, ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్, జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటే.. అన్ లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు.
749 ప్లాన్‌లో 72 రోజుల వ్యాలిడిటీ :
లాంగ్ టైమ్ రీఛార్జ్ కోరుకునే యూజర్లకు రూ.749 ప్లాన్ బెస్ట్. ప్రతిరోజూ 2GB డేటా, 100 SMSలతో అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ రీఛార్జ్ ప్లాన్‌పై 20GB అదనపు డేటాను కూడా ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులు కాగా, జియో వార్షికోత్సవ ఆఫర్‌లు కూడా పొందవచ్చు.
జియో యానవర్సరీ ఈ ప్లాన్‌లను అందరి యూజర్ల కోసం అందిస్తోంది. ఓటీటీ లేదా గేమింగ్ యూజర్లు ఎవరైనా సరే ఈజీగా యాక్సస్ చేయొచ్చు. ఈ జియో ప్లాన్లలో అదనపు డేటా, ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.