Realme Narzo 70 Series : రియల్‌మి నార్జో 70 సిరీస్ ఫ్లాష్ సేల్ మొదలైందోచ్.. ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

Realme Narzo 70 Series : రియల్‌మి నార్జో 70 ఫోన్ 5జీ 6జీబీ+128జీబీ, 8బీబీ+ 128జీబీ ఫోన్ 2 వేరియంట్‌లకు రియల్‌మి, అమెజాన్ రెండింటిలోనూ రూ. వెయ్యి విలువైన కూపన్ అందుబాటులో ఉంది.

Realme Narzo 70 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి భారత మార్కెట్లో ఇటీవలే 2 ఎంట్రీ లెవల్ స్మార్ట్‌‌ఫోన్‌లను ప్రకటించింది. రియల్‌మి నార్జో 70, నార్జో 70ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ అమెజాన్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ కొనుగోలుకు ఆసక్తి ఉంటే.. కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లు ఉన్నాయి. 4జీబీ+128జీబీ వెర్షన్ కొనుగోలుదారులు రూ. వెయ్యి విలువైన కూపన్‌ను పొందవచ్చు. 6జీబీ+ 128జీబీ వెర్షన్ ధర రూ. 1500 విలువైన కూపన్ పొందవచ్చు. రియల్‌మి నార్జో 70 ఫోన్ 5జీ 6జీబీ+128జీబీ, 8బీబీ+ 128జీబీ ఫోన్ 2 వేరియంట్‌లకు రియల్‌మి, అమెజాన్ రెండింటిలోనూ రూ. వెయ్యి విలువైన కూపన్ అందుబాటులో ఉంది.

రియల్‌‌మి నార్జో 70 సిరీస్ 5జీ ధరలు తగ్గింపు :
రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. 4జీబీ+128జీబీ వెర్షన్ రూ. వెయ్యి విలువైన కూపన్‌తో రూ.11,999 ధరతో ఆఫర్ ధరను రూ.10,999కి తగ్గించింది. ఈ వేరియంట్ ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫ్లాష్ సేల్‌లో అందుబాటులో ఉంటుంది. 6జీబీ+128జీబీ వెర్షన్ ధర రూ. 13,499కు పొందవచ్చు. రూ. 15వందల విలువైన కూపన్‌తో కొనుగోలుదారులు రూ. 11,999కి పొందవచ్చు. ఈ వేరియంట్ రియల్‌‌మి, అమెజాన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మే 3 నుంచే ప్రారంభం.. ఏయే స్మార్ట్‌‌ఫోన్లపై ఎంత డిస్కౌంట్ ఉండొచ్చుంటే?

రియల్‌‌మి నార్జో 70 5జీ సిరీస్‌ ఫోన్ 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.15,999కు పొందవచ్చు. కొనుగోలుదారులు రూ. వెయ్యి తగ్గింపును పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. రియల్‌‌మి ఆఫర్ ధర రూ.14,999 అవుతుంది. ఈ వేరియంట్ కూడా ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఫ్లాష్ సేల్‌లో పొందవచ్చు. చివరగా, 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 16,999, ఆఫర్ ధర రూ. 15,999, రియల్‌మి వెబ్‌సైట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

రియల్‌మి నార్జో 70ఎక్స్, నార్జో 70 స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ భారీ 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 120హెచ్‌‌జెడ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్‌ ఆకట్టుకునే వ్యూ అందిస్తుంది. హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో అందిస్తుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 45డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో వస్తుంది.

ఫొటోగ్రఫీ ముందు వెనుకవైపు 2ఎంపీ సెకండరీ లెన్స్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, సెల్ఫీలకు 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 బ్లూటూత్ 5.2 మెరుగైన భద్రతకు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆడియోకు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

రియల్‌మి నార్జో 70 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్‌సెట్‌తో ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. రియల్‌మి టీజర్‌ ప్రకారం.. అత్యంత వేగవంతమైనది. హారిజోన్ డిజైన్ కేవలం 7.97ఎమ్ఎమ్ మందంతో 188 గ్రాముల బరువు కలిగి ఉంది. ఈ ఫోన్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్టంగా 2000 నిట్‌ల బ్రైట్‌నెస్, స్మూత్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. గణనీయమైన 4,356ఎమ్ఎమ్ స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. రియల్‌మి నార్జో 70 బెస్ట్ మోడల్ అని చెప్పవచ్చు. ఇందులో 50ఎంపీ ఏఐ కెమెరా, డెప్త్ సెన్సింగ్ 2ఎంపీ బీఅండ్ డబ్ల్యూ కెమెరా, సెల్ఫీలకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో సహా మల్టీఫేస్ సెటప్ ఉంటుంది. 45డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ అందిస్తుంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీ ఈ ఫీచర్లన్నింటికి పవర్ అందిస్తుంది. రియల్‌‌మి లైటనింగ్ ఛార్జింగ్ టైమ్ అందిస్తోంది. ఈ నథింగ్ ఫోన్ కేవలం 61 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌ అవుతుంది. కేవలం 27 నిమిషాల్లో 50శాతం ఛార్జ్ అవుతుంది.

Read Also : Nothing Phone 2a : బ్లూ వేరియంట్‌తో నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు