Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మే 3 నుంచే ప్రారంభం.. ఏయే స్మార్ట్‌‌ఫోన్లపై ఎంత డిస్కౌంట్ ఉండొచ్చుంటే?

Flipkart Big Saving Days Sale : లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3న ప్రారంభమై మే 9 వరకు కొనసాగుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ సేల్ సమయంలో అందుబాటులో ఉండే కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ వెల్లడించింది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మే 3 నుంచే ప్రారంభం.. ఏయే స్మార్ట్‌‌ఫోన్లపై ఎంత డిస్కౌంట్ ఉండొచ్చుంటే?

Flipkart Big Saving Days Sale (Image Source : Google )

Updated On : April 29, 2024 / 4:20 PM IST

Flipkart Big Saving Days Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ డే సేల్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. అమెజాన్ మాదిరిగా కాకుండా, సేల్ ఈవెంట్‌లో కొన్ని డీల్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3న ప్రారంభమై మే 9 వరకు కొనసాగుతుంది. అమెజాన్ సేల్ మే 2న ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్‌లు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటివరకు వెల్లడించిన కొన్ని మొబైల్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 16 : ఫిజికల్ బటన్ డిజైన్ లేకుండానే ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ డేటా వెల్లడి!

ఫ్లిప్‌కార్ట్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ రూ. 27,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటుంది. అయితే, మోటో ఎడ్జ్ 40 నియో ధర రూ. 19,999కి అందిస్తోంది. మోటో జీ64 ధర రూ.12,999, మోటో జీ34 ధర రూ. 9,999కు పొందవచ్చు. పోకో ఎమ్6 ఫోన్ రూ. 7,999 తక్కువ ధరకే విక్రయిస్తోంది. పోకో ఎక్స్6 ప్రో, పోకో ఎమ్6 ప్రో, వివో టీ3 వంటి డివైజ్‌‌లు అమ్మకానికి ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్లపై తగ్గింపు ధరకే ఆఫర్లు.. :
పోకో ఎక్స్6, ఐఫోన్ 12 ధర వరుసగా రూ. 17,999, రూ. 39,499కు పొందవచ్చు. కొన్ని ఆఫర్‌లతో పిక్సెల్ 7ఎ ఫోన్ ధర రూ. 31,999కి పడిపోతుంది. ఫ్లిప్‌‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో పిక్సెల్ 8 ఫోన్ రూ.49,999కి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 14 రూ. 55,999కి విక్రయిస్తోంది.

లేటెస్ట్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ కూడా ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. నథింగ్ ఫోన్ 2ఎ, పోకో ఎక్స్6 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, వివో టీ2 ప్రో వంటి డివైజ్‌లపై ఫ్లిప్‌కార్ట్ మెగా తగ్గింపు అందించనుంది. ప్రస్తుతానికి ఈ వివరాలు తెలియరాలేదు.

ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ కార్డ్‌లపై ఫ్లాట్ డిస్కౌంట్ అందించే అవకాశం ఉంది. అమెజాన్ డిస్కౌంట్లతో కూడిన డివైజ్‌ల జాబితాను వెల్లడించింది. వన్‌ప్లస్ డివైజ్‌లపై కూడా డిస్కౌంట్లను అందించనుంది. అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 3 వంటివి ఉన్నాయి.

రెడ్‌మి 13సి, రెడ్‌మి నోట్ 13ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎమ్34, షావోమీ 14, గెలాక్సీ ఎస్23, ఐక్యూ Z9, గెలాక్సీ ఎస్24, టెక్నో పోవా 6ప్రో వంటి డివైజ్‌లు డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ ఫోన్‌లు ఇతర మోడల్‌ల కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్ ఐఫోన్ యూజర్లు ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!