Realme P4 Power 5G : చార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 10,000mAh బ్యాటరీ రియల్‌మి 5G ఫోన్‌పై ఖతర్నాక్ ఆఫర్!

Realme P4 Power 5G : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి P4 పవర్ 5జీ ఫోన్ భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్‌లో 10,001mAh బ్యాటరీ, 144Hz అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

Realme P4 Power 5G

  • బ్యాంకు ఆఫర్లతో రియల్‌మి P4 పవర్ 5Gపై భారీ తగ్గింపు
  • 10,001mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు
  • డైమెన్సిటీ 7400 అల్ట్రా, 50MP OIS కెమెరా సెటప్

Realme P4 Power 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్‌మి లవర్స్ కోసం అదిరిపోయే డిస్కౌంట్.. రియల్‌మి P4 పవర్ 5జి ఫోన్ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌బ్యాంక్ సైజులో భారీ 10001mAh బ్యాటరీ ఉంది.

లాంచ్ తర్వాత భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత చౌకైన ధరకే లభిస్తోంది. రియల్‌మి P4 పవర్ 5Gలో 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా NOC 50MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉన్నాయి.

బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు : 
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి P4 పవర్ 5జీ ఫోన్ రూ. 29,499 ధరకు లభిస్తోంది. ఈ ధర బేస్ 8GB ర్యామ్, 128GB వేరియంట్‌, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లు వరుసగా రూ. 31,999, రూ. 34,999 ధరకు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Bi-monthly Payroll System : నెలలో రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ ఐడియా ఉద్యోగుల జీవితాలు మార్చేస్తుందా?

వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా రూ.1,475 నుంచి రూ. 1,725 ​​వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 28,024 అవుతుంది.

రియల్‌మి P4 పవర్ 5జీ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో OISతో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా 16ఎంపీతోపాటు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. రియల్‌మి P4 పవర్ 5జీ ఫోన్ 10,001mAh భారీ బ్యాటరీ. 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. యానిమేషన్‌లు, మల్టీ-టాస్కింగ్ కోసం కొత్త ఫ్లక్స్ ఇంజిన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.