Bi-monthly Payroll System : నెలలో రెండుసార్లు జీతం.. అనుపమ్ మిట్టల్ ఐడియా ఉద్యోగుల జీవితాలు మార్చేస్తుందా?
Bi-monthly Payroll System : భారత్‌లో ఒకే జీతం రెండు సార్లు వస్తే ఎలా ఉంటుంది? ఇదే విషయంలో అనుపమ్ మిట్టల్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. నిజంగా ఇది భారతీయ ఉద్యోగుల జీతాల చెల్లింపు విధానాన్ని మార్చేస్తుందా? ఫుల్ డిటెయిల్స్..
bi-monthly payroll system
- అనుపమ్ మిట్టల్ ఐడియా భారత్‌లో వర్క్ అవుతుందా?
- నెలలో రెండుసార్లు జీతం తీసుకుంటే ఎలా ఉంటుంది?
- మిట్టల్ చెబుతున్న ఈ పేరోల్ ఆలోచన ఏంటి?
Bi-monthly Payroll System : ఒకే జీతం రెండు సార్లు వస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఊహించుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదూ.. ఒక నెలలో రావాల్సిన జీతం మొదటి 15 రోజుల్లో 50 శాతం వచ్చి.. మిగిలిన జీతం నెలాఖరులో వస్తే ఇక జీతగాళ్లకు నిజంగా పండగే అనిపిస్తుంది.
వాస్తవానికి ఈ ఆలోచన చాలా మంది ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది. ఎందుకంటే.. అద్దె, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, రోజువారీ ఖర్చులతో సతమతమయ్యే చాలా మందికి నెలకు రెండుసార్లు జీతం అనేది ఒక కల లాంటిది. నిజంగానే ఈ విధానం అమల్లోకి వస్తుందంటే ఉద్యోగులు ఎవరైనా ఎగిరిగంతేస్తారు.
ప్రస్తుతం భారత్‌లో అమల్లో ఉన్న నెలవారీ పేరోల్ విధానానికి స్వస్తి పలికి నెలలో రెండుసార్లు జీతం చెల్లించే విధానాన్ని పరిశీలించాలని షాదీ.కామ్ వ్యవస్థాపకుడు షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్ సూచించారు. ఆయన ఈ ప్రతిపాదనను లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు జీతాల చెల్లింపునకు సంబంధించి కొత్త చర్చకు తెరలేపింది. జీతం రెండు విడతల్లో వస్తే ఉద్యోగులకు మరింత ఆర్థిక వెసులుబాటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనుపమ్ మిట్టల్ ప్రకారం.. ప్రస్తుత రోజుల్లో కంపెనీలు కంఫర్ట్ వర్కింగ్ అవర్స్, ఆఫీసులో ఉచిత భోజనం, ఎక్కువ సెలవులు వంటి సౌకర్యాలు ఉండాలన్నారు. భారత్‌లో చాలా కంపెనీలు నెల మొదటి వారంలో (ఉదాహరణకు 5వ లేదా 7వ తేదీన) జీతాలు చెల్లిస్తాయి. చాలా కంపెనీలు ఫస్ట్ తారీఖునే బ్యాంకు అకౌంట్లలో జీతాలు వేస్తుంటాయి. కానీ, వారాంతాలు, బ్యాంకు సెలవులు లేదా ఇతర కారణాల వల్ల జీతాల చెల్లింపులు ఆలస్యం అవుతుంటాయి.
ఒకే జీతం రెండు సార్లు.. కొత్త ఫార్ములా ఏంటి? :
కంపెనీలు నెలకు రెండుసార్లు, ఫస్ట్ 15వ తేదీన, ఆపై 30వ తేదీన జీతాలు చెల్లించాలని అనుపమ్ మిట్టల్ చెబుతున్నారు. నెల మధ్యలో జీతం అందుకోవడం వల్ల ఉద్యోగుల నెలవారీ బడ్జెట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. చిన్న చిన్న ఖర్చుల కోసం ఇకపై క్రెడిట్ కార్డులు లేదా లోన్ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు.
Read Also : Bolla Brahmanaidu : గండిపేట భూకబ్జా కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు
ఉద్యోగులకు ప్రతి నెలా రెండుసార్లు జీతం చెల్లిస్తారు. ఫలితంగా సంవత్సరానికి 24 పే చెక్కులు వస్తాయి. అలాగే, ఉద్యోగులకు ప్రతి రెండు వారాలకు ఒకసారి జీతం చెల్లించడం వల్ల ఒక ఏడాదిలో 52 వారాలు ఉంటాయి కాబట్టి, ఉద్యోగులు ఏడాదికి 26 జీతం చెక్కులను అందుకుంటారు, కొన్ని నెలల్లో రెండుకు బదులుగా మూడు శాలరీ పేమెంట్ తేదీలు ఉంటాయి.
ఇండియాలో ఈ విధానం వర్క్ అవుతుందా? :
భారత్‌లో ప్రధానంగా నెలవారీ జీతాల పేమెంట్ విధానం ఉంది. ఉద్యోగులు సాధారణంగా నెల చివరి రోజున ఆ తర్వాతి నెల ఫస్ట్ డే లేదా ఫస్ట్ వీక్ ఎప్పుడైనా జీతాలను అందుకుంటారు. చాలా మంది ఉద్యోగులకు ఇది బాగానే ఉంటుంది. కానీ, లక్షలాది మంది జీతభత్యాలు పొందే ఉద్యోగులకు, క్యాష్ పేమెంట్ టైమింగ్ కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. ఎందుకంటే.. ఒక తేదీన అద్దె, మరో తేదీన ఈఎంఐలు, ఇంకో తేదీన క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించాలి. జీతం తేదీలు సమయానికి అందనప్పుడు ఉద్యోగులు సేవింగ్స్, శాలరీ అడ్వాన్సులు లేదా చిన్న మొత్తంలో లోన్లపై ఆధారపడవలసి రావచ్చు.
రూల్ మార్చేసిన షాదీ.కామ్ :
కంపెనీ (Shaadi.com) కొన్ని ఏళ్ల క్రితమే జీతాల పేమెంట్ సిస్టమ్ మార్చిందని అనుపమ్ మిట్టల్ తెలిపారు. నెల చివరి రోజున జీతాలు చెల్లించాలని తమ కంపెనీ నిర్ణయించుకుందని చెప్పారు. జీతాలు ఆలస్యమైతే లోన్ ఈఎంఐలు బౌన్స్ అవ్వడం, ఇంటి అద్దె కట్టలేక ఇబ్బందులు, అనవసరమైన పెనాల్టీలు చెల్లించడం వంటి ఎదురవుతాయని చెప్పారు.
పక్క దేశాల్లో జీతాలు ఎలా ఇస్తారంటే? :
ప్రపంచవ్యాప్తంగా జీతాల చెల్లింపునకు ఒకే సిస్టమ్ అంటూ లేదు. అనేక దేశాల్లో కంపెనీలు జీతాలను వారానికి లేదా రెండు వారాలకు, రెండు నెలలకు లేదంటే నెలవారీగా కూడా చెల్లిస్తున్నాయి. అందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, డెన్మార్క్, ఈజిప్ట్, ఫిన్లాండ్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, రష్యా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఇండస్ట్రీ, కంపెనీ స్థాయి, స్థానిక నిబంధనలను బట్టి పేరోల్ సిస్టమ్స్ మారుతుంటాయి.
