Realme P4R 5G : బడ్జెట్ ధరలో బ్యాటరీ బీస్ట్.. AI ఫీచర్లతో కొత్త రియల్‌మి P4R 5G.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?
Realme P4R 5G : రియల్‌మి P4R 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP ఏఐ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
- Sreehari A
- Updated on- June 11, 2026 / 12:08 PM IST
Realme P4R 5G Launch
- రియల్‌మి P4R 5G ఫోన్ 8000mAh టైటాన్ బ్యాటరీ సెటప్
- ఈ ఫోన్‌లో 144Hz డిస్‌ప్లే, 50MP ఏఐ కెమెరా ఆప్షన్లు
- ఫుల్ ఛార్జ్.. 3 రోజుల బ్యాకప్, ధర రూ. 16,999 మాత్రమే
Realme P4R 5G : రియల్‌మి లవర్స్ ఎగిరిగంతేసే న్యూస్.. రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. రియల్‌మి P4R 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో భారీ 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 144Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ భారీ బ్యాటరీతో పాటు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుందని (Realme P4R 5G) కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. IP65 రేటింగ్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ మన్నికను కూడా అందిస్తుంది.
ఈ నెల 17 నుంచి ఫస్ట్ సేల్ :
రియల్‌మి P4R 5జీ ఫోన్ జూన్ 17, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్, (realme.com) ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 4GB+128GB వేరియంట్‌కు ధర రూ. 18,999, 6GB+128GB వేరియంట్‌కు రూ. 20,999, 6GB+256GB వేరియంట్‌కు రూ. 22,999గా నిర్ణయించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ టైటానియం గ్లేర్, సిల్వర్ గ్లేర్, లావెండర్ గ్లేర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా అన్ని వేరియంట్‌లపై రూ. 2వేలు బ్యాంక్ డిస్కౌంట్, 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తుంది.
ఫుల్ ఛార్జింగ్ 3 రోజుల బ్యాకప్ :
ఆఫర్ తర్వాత ప్రారంభ ధర రూ. 16,999కు తగ్గుతుంది. రియల్‌మి P4R 5జీ ఫోన్‌లో 8000mAh టైటాన్ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్. కంపెనీ ప్రకారం.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఈ ఫోన్ కేవలం 8.8mm మందం 224 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. బ్యాటరీ 1600 ఛార్జింగ్ సైకిళ్లను తట్టుకునేలా 7 ఏళ్ల వరకు 80శాతం కన్నా ఎక్కువ మన్నికను అందిస్తుంది.
ఏఐ ఫీచర్లు అదుర్స్ :
ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. గేమింగ్ సమయంలో హీట్ తగ్గిస్తుంది. బీజీఎంఐ ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లలో లాంగ్ టైమ్ స్టేబుల్ 60fps పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ రియల్‌మి ఫోన్ వన్ ట్యాప్ కూలింగ్, ఏఐ నైట్ ఛార్జింగ్ మోడ్ ఏఐ కోల్డ్ ఛార్జింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే..
రియల్‌మి P4R 5జీలో F1.8 అపర్చర్‌తో 50MP ఏఐ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో మోషన్ ఫోటో, ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ అన్‌బ్లర్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. టెక్స్ట్ స్కానర్, నోట్స్ కోసం ఏఐ అసిస్టెంట్, గూగుల్ జెమినికి కూడా సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ ఫీచర్లలో ఏఐ యాంటీ-థెఫ్ట్ గూగుల్ రిమోట్లీ లాక్ ఉన్నాయి.
రియల్‌మి P4R 5జీ ఫోన్ 1200 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.8-అంగుళాల 144Hz సన్‌లైట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. కంపెనీ 5300mm² వీసీ కూలింగ్ సిస్టమ్ అందించింది. మన్నిక కోసం ఈ ఫోన్ ఆర్మర్‌షెల్ టఫ్ బిల్డ్, ఐపీ65 రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్‌తో వస్తుంది.
