Realme P4R 5G : బ్యాటరీ టెన్షన్‌కు గుడ్‌బై.. 8000mAh బ్యాటరీతో రియల్‌మి కొత్త 5G ఫోన్.. ధర జస్ట్ ఎంతంటే?
Realme P4R 5G : రియల్‌మి P4R 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,999కే లభిస్తోంది. 8000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- November 16, 2026 / 02:57 PM IST
Realme P4R 5G
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రియల్‌మి ఫోన్ అదుర్స్
- రూ.20 వేల లోపే 8000mAh బ్యాటరీ ఫోన్.. రియల్‌మి P4R 5జీలో ఫీచర్లు
- తక్కువ ధరలో భారీ బ్యాటరీ ఫోన్ కావాలా? ఈ రియల్‌మి 5Gపై సూపర్ ఆఫర్
Realme P4R 5G : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? స్మార్ట్‌ఫోన్ ఎంత బాగున్నా బ్యాటరీ త్వరగా అయిపోతుంటే మాత్రం చిరాకే కదా.. ముఖ్యంగా రోజంతా ఫోన్‌లోనే పనులు చేసుకునేవారికి బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం..
అలాంటి వారి కోసం భారీ బ్యాటరీతో వచ్చిన రియల్‌మి P4R 5జీ ఇప్పుడు బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఏకంగా 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఆకట్టుకుంటున్న ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్‌తో రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు.. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
రియల్‌మి పీ4ఆర్ 5జీ ధర, ఆఫర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.20,999కు లభిస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2వేలు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.18,999కు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్‌తో ఎక్సేంజ్ చేస్తే అదనపు బెనిఫిట్ పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
Read Also : Motorola Edge 70 Fusion : సూపర్ ఆఫర్ మావా.. ఈ మోటోరోలా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫీచర్లు కోసమైన కొనేస్తారు..!
8000mAh బ్యాటరీ.. 45W ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ ఫోన్‌లో 8000mAh భారీ బ్యాటరీ అత్యంత ఆకర్షణ కాగా రోజంతా ఫోన్‌ను ఎక్కువగా వాడేవారికి అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఇక 6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. :
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. ఫొటోల కోసం బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఉంది.
5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా భారీ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునేవారు ఈ ఫోన్‌ను తీసుకోవచ్చు. అయితే, కొనుగోలు చేసే ముందు బ్యాంక్ ఆఫర్, ధర, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లను మరోసారి చెక్ చెసుకోండి..
