Realme Valentine’s Week Sale : మీ గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా? ఈ 3 రియల్‌‌మి ఫోన్లపై రూ.10వేల వరకు డిస్కౌంట్.. ఓ లుక్కేయండి!

Realme Valentine’s Week Sale : వాలంటైన్స్ డే వస్తోంది. మీ గర్ల్ ఫ్రెండ్‌కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? రియల్‌మి వాలంటైన్స్ డే సేల్‌లో ఈ మూడు రియల్‌మి ఫోన్లపై ఏకంగా రూ. 10వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.. మీరు ఓసారి లుక్కేయండి..

Realme Valentine’s Week Sale

Realme Valentine’s Week Sale : ‘వాలెంటైన్స్ డే’కి ఇంకా కొన్ని రోజులే ఉంది. చేతిలో డబ్బు లేనప్పుడు ఏం చేయగలం? మీ పార్టనర్‌కు బహుమతి ఇవ్వాల్సిన టెన్షన్ ఇదేనా? రియల్‌మి మీ వెంట ఉంది. రియల్‌మి వాలెంటైన్స్ సేల్ అందిస్తోంది.

ఈ సేల్ సందర్భంగా రియల్‌మి 3 స్టైలిష్ ఫోన్లపై భారీగా ధరలను తగ్గించింది. మీరు ఈ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. అమెజాన్‌లో రియల్‌మి డీల్స్ చెక్ చేసుకోవడమే.. ఈ ఆఫర్ ఏయే ఫోన్లపై అందిస్తోంది. ఆ ఫోన్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : కొంటే ఇలాంటి కారు కొనాల్సిందే.. ఏకంగా రూ. 75వేలు డిస్కౌంట్.. ఇది కదా ఆఫర్ అంటే?

రియల్‌మి తన బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక వాలెంటైన్స్ వీక్ ఆఫర్‌లను ప్రారంభించింది. తన కస్టమర్లకు రూ. 10వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఎంపిక చేసిన ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు అవకాశాన్ని అందిస్తోంది.

ఈ సేల్ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగుతుంది. ఈ ఆఫర్ అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ (realme.com), ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. వాలెంటైన్స్ డే సందర్భంగా.. మీరు ఇక్కడ నుంచే స్పెషల్ డీల్స్‌పై ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.

మీ భాగస్వామికి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తారా? :
మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? మీ భాగస్వామికి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ఈ లిమిట్ పిరియడ్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. మీరు కంపెనీ రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ, రియల్‌మి జీటీ 6టీ, రియల్‌మి జీటీ 7 ప్రో ఫోన్‌లను లాంచ్ ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి వాలెంటైన్స్ డే స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ :
అమెజాన్ అనేక రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. అదనపు డిస్కౌంట్లు, ఈఎంఐ ఆప్షన్లతో వస్తుంది. రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్ ధర 6జీబీ+ 128జీబీ స్టోరేజ్ ధర రూ. 13,999. (రూ. 3వేలు తగ్గింపు) 8జీబీ + 128జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999. (రూ. 3వేలు తగ్గింపు), 12జీబీ + 256జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999 (రూ. 2వేలు తగ్గింపు) అందిస్తోంది.

రియల్‌మి జీటీ 6టీ ఫోన్ :
రియల్‌మి జీటీ 6టీ ఫోన్ ధర 8జీబీ+ 256జీబీ స్టోరేజ్ ధర రూ. 25,999. (రూ. 7వేలు తగ్గింపు) 12జీబీ + 256జీబీ స్టోరేజ్ ధర రూ. 27,999. (రూ. 8వేలు డిస్కౌంట్) పొందవచ్చు.

Read Also : Mohini Mohan Dutta : రతన్ టాటా వీలునామాలో షాకింగ్ పేరు? ఎవరీ మోహిని మోహన్ దత్తా.. ఈ మిస్టరీ మ్యాన్‌కు రూ. 500 కోట్లు రాసిచ్చాడు!

రియల్‌మి జీటీ 7 ప్రో :
రియల్‌మి జీటీ 7 ప్రో 12జీబీ + 256జీబీ స్టోరేజ్ ధర రూ. 54,999. (రూ. 5వేలు తగ్గింపు), 16జీబీ+ 512జీబీ స్టోరేజ్ ధర రూ. 59,999. (రూ. 6వేలు తగ్గింపు) పొందవచ్చు.

ఈ డిస్కౌంట్లన్నీ రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన రియల్‌మి ఫోన్‌లపై అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫోన్‌లను కొనుగోలు చేయడం ద్వారా మీరు రియల్‌మి టెక్‌లైఫ్ స్టూడియో (Techlife Studio) H1 హెడ్‌ఫోన్‌లను ఉచితంగా పొందవచ్చు. మీ స్నేహితురాలికి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.