RedMagic 11S Pro : భారీ బ్యాటరీతో కొత్త గేమింగ్ 5G ఫోన్.. ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు.. ధర జస్ట్ ఎంతంటే?
RedMagic 11S Pro : రెడ్‌మ్యాజిక్ కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ 11S ప్రోను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 7500mAh బ్యాటరీ ఉన్నాయి.
- Sreehari A
- Published on- May 28, 2026 / 03:15 PM IST
RedMagic 11S Pro
- 6.85-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ బీఈఓ X10 డిస్‌ప్లే
- 16ఎంపీ OV16A అండర్-డిస్‌ప్లే ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
- థర్మల్ మేనేజ్‌మెంట్, బ్యాటరీ లైఫ్, ఏఐ ఇంటిగ్రేషన్
RedMagic 11S Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన ఫీచర్లతో రెడ్‌మ్యాజిక్ 11ఎస్ ప్రో ఫోన్ వచ్చేసింది. ఇటీవలే చైనాలో ఈ కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్ కాగా ఇప్పుడు ఆ కంపెనీ భారత్ సహా ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
స్టేబుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు ఈ ఫోన్ అత్యంత (RedMagic 11S Pro) ఆకర్షణీయంగా ఉంది. రెడ్‌మ్యాజిక్ 10S ప్రోతో పోలిస్తే.. ఈ కొత్త మోడల్ ప్రాసెసింగ్ పవర్, థర్మల్ మేనేజ్‌మెంట్, బ్యాటరీ లైఫ్ ఏఐ ఇంటిగ్రేషన్‌లో అనేక కీలక అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఈ రెడ్‌మ్యాజిక్ 11ఎస్ ప్రోకు సంబంధించి ధర, పూర్తి ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్‌మ్యాజిక్ 11S ప్రో ధర :
ధర విషయానికి వస్తే.. ఈ రెడ్‌మ్యాజిక్ ఫోన్ 12GB+256GB నైట్‌ఫ్రీజ్ వేరియంట్ ధర అమెరికాలో 849 డాలర్లు (సుమారుగా రూ. 81,245), 16GB+512GB వేరియంట్ ధర అమెరికాలో 949 డాలర్లు (సుమారుగా రూ. 90,815)కు లభిస్తుంది. ఈ రెడ్‌మ్యాజిక్ ఫోన్ జూన్ 10న అమ్మకానికి రానుంది.
Read Also : Vivo S60 5G : బ్యాటరీ టెన్షన్‌కు గుడ్‌బై.. వివో కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!
రెడ్‌మ్యాజిక్ 11S ప్రో స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. ఈ ఫోన్‌లో 6.85-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ బీఈఓ X10 డిస్‌ప్లే ఉంది. దీనికి 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 960Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, 100శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్ 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 4.7GHz వరకు క్లాక్ స్పీడ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 లీడింగ్ ఎడిషన్ 3nm ప్రాసెసర్, అడ్రినో 840 జీపీయూ, 12GB/16GB LPDDR5X అల్ట్రా ర్యామ్, 256GB/512GB (యూఎఫ్ఎస్ 4.1) స్టోరేజ్ ఉన్నాయి.
రెడ్‌మ్యాజిక్ 11S ప్రో కెమెరా స్పెసిఫికేషన్లు :
కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP 1/1.55 OV50E40 సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ఎఫ్/1.88 అపర్చర్ OISతో 50MP 1/2.88, OV50D40 120-డిగ్రీల అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 16MP OV16A అండర్-డిస్‌ప్లే ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 7500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పొందవచ్చు.
