Redmi 15A 5G : రెడ్‌మి లవర్స్ గెట్ రెడీ.. కొత్త రెడ్‌మి 15A 5G వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?
Redmi 15A 5G : రెడ్‌మి ఇండియా లైనప్‌లో మరో కొత్త 5G ఫోన్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. రెడ్‌మి 15A 5G మార్చి 27న లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.
- Sreehari A
- Published On : March 20, 2026 / 03:40 PM IST
Redmi 15A 5G
- రెడ్‌మి నుంచి మరో కొత్త 5G ఫోన్ రాబోతుంది
- మార్చి 27న భారత మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త ఫోన్
- కీలక స్పెషిఫికేషన్లు, డిజైన్ వివరాలు రివీల్ చేసిన కంపెనీ
Redmi 15A 5G : రెడ్‌మి ఫ్యాన్స్‌కు అద్భుతమైన న్యూస్.. సరికొత్త ఫీచర్లతో రెడ్‌మి 15A 5జీ ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే షావోమీ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ మైక్రోసైట్ అందుబాటులో ఉంది. ఈ బ్రాండ్ డిజైన్, కలర్ ఆప్షన్లు, కొన్ని కీలక ఫీచర్లకు సంబంధించి టీజర్‌లను కూడా షేర్ చేసింది. చిన్నపాటి మార్పులతో డిజైన్ కనిపిస్తుంది. అంచనాల ప్రకారం.. రెడ్‌మి 15A 5జీ క్లియర్ డిజైన్‌తో వస్తుంది.
బ్యాక్ సైడ్ చాలా చదునుగా ఉంటుంది. రెండు లెన్స్‌లు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్‌తో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ ఉంటుంది. బ్రాండింగ్ బాటమ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రెడ్‌మి ఫోన్‌లకు చాలా సాధారణం. పింక్ వేరియంట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫ్రంట్ సైడ్ మందపాటి బెజెల్స్, వాటర్‌డ్రాప్-స్టయిల్ నాచ్ కనిపిస్తాయి. పవర్ బటన్, వాల్యూమ్ కీలు రైట్ సైడ్ ఉన్నాయి.
బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే ఆప్షన్లు :
రెడ్‌మి ఇప్పటికే కొన్ని కీలక స్పెసిఫికేషన్లను ధృవీకరించింది. ఈ ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అందించే డిస్‌ప్లే ఉంటుంది. స్మూత్ స్క్రోలింగ్, సాధారణ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ఇందులో 6,300mAh బ్యాటరీ కూడా ఉంది. రోజంతా ఛార్జింగ్ వస్తుంది.
కెమెరా, పర్ఫార్మెన్స్ వివరాలు :
కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మి 15A 5జీ డ్యూయల్ రియర్ సెటప్‌తో వస్తుంది. మెయిన్ కెమెరా 32MP ఏఐ సెన్సార్, రెండో సెన్సార్ గురించి ఇంకా వివరాలు రివీల్ చేయలేదు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్ ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. రెడ్‌మి ఇంకా కచ్చితమైన ప్రాసెసర్‌ను వెల్లడించలేదు.
రెడ్‌మి లైనప్‌లో మరో 5G ఫోన్ :
2025 ఆగస్టులో భారత మార్కెట్లో లాంచ్ అయిన రెడ్‌మి 15 5జీ కన్నా ఈ ఫోన్ లో రేంజ్‌లో ఉంటుందని అంచనా. రెడ్‌మి 15 5జీ ఫోన్ 7,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్ అందించే 6.9-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ రూ. 14,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అదే సిరీస్‌లో 15A 5G కూడా తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది.
