Redmi 17C 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్‌మి 17C 5G ఫోన్‌పై ఓ లుక్కేయాల్సిందే.. ఫీచర్లు మామూలుగా లేవు!

Redmi 17C 5G Launch : రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? 50MP మెయిన్ కెమెరా అనేక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. రెడ్‌మి 17C 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. పూర్తి వివరాలివే..

Redmi 17C 5G Launch

  • ఈ ఫోన్‌లో డీసీ డిమ్మింగ్ టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్
  • రెడ్‌మి 17సీ 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
  • 50MP కెమెరా, 30fps వద్ద 1080p వీడియోల రికార్డింగ్

Redmi 17C 5G Launch : రెడ్‌మి ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త రెడ్‌మి 17C 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేసే 6.9-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇందులో డీసీ డిమ్మింగ్ టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. 6000mAh బ్యాటరీతో వస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా అనేక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ కూడా అందిస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్ ధర, ఇతర ముఖ్య ఫీచర్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రెడ్‌మి 17C 5జీ ధర ఎంతంటే? :
సింగపూర్‌లో రెడ్‌మి 17సీ 5జీ ఫోన్ ధర 279 డాలర్లు (దాదాపు రూ. 19వేలు) ఉండొచ్చు. ఈ ఫోన్ పర్పుల్, బ్లాక్ బ్రౌన్ (వేగన్ లెదర్ ఫినిష్) వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇతర మార్కెట్లలో రెడ్‌మి 17సీ 5జీ రిలీజ్ విషయంలో కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు అయింది.

రెడ్‌మి 17C 5జీ స్పెసిఫికేషన్లు :

రెడ్‌మి 17సీ 5జీ ఫోన్ 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ స్మూత్ స్క్రోలింగ్ గేమింగ్ కోసం 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. ఈ ఫోన్ 660 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను HBM మోడ్‌లో 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది.

Read Also : Tecno Spark Go 3 Pro : టెక్నో లవర్స్ గెట్ రెడీ.. లాంచ్‌కు ముందే దుమ్మురేపుతున్న కొత్త స్పార్క్ గో 3 ప్రో.. ఫుల్ డిటెయిల్స్!

కంటి ఒత్తిడిని తగ్గించేందుకు డీసీ డిమ్మింగ్ టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ అందిస్తుంది. రెడ్‌మి 17సీ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 4GB ర్యామ్, 64GB, 128GB స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీని (1TB వరకు) పెంచుకోవచ్చు.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
రెడ్‌మి 17C 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఆగ్జిలరీ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ HDR, నైట్ మోడ్ పోర్ట్రెయిట్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. వీడియో రికార్డింగ్ కోసం 30fps వద్ద 1080p వీడియోను రికార్డ్ చేయొచ్చు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంది.

33W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కానీ, కంపెనీ బాక్స్‌లో 15W ఛార్జర్‌ను మాత్రమే అందించింది. ఇతర ఫీచర్లలో డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi, బ్లూటూత్ 5.4, NFC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో ఉన్నాయి. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కొలతలు 171.56×79.47×8.05mm, బరువు 211 గ్రాములు ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ కూడా ఉంది.