Tecno Spark Go 3 Pro : టెక్నో లవర్స్ గెట్ రెడీ.. లాంచ్‌కు ముందే దుమ్మురేపుతున్న కొత్త స్పార్క్ గో 3 ప్రో.. ఫుల్ డిటెయిల్స్!
Tecno Spark Go 3 Pro : టెక్నో స్పార్క్ గో 3 ప్రో ఈఈసీ టీయూవీ సర్టిఫికేషన్ డేటాబేస్‌లలో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,100 mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. పూర్తి ఫీచర్లు, స్పెషిఫికేషన్ల వివరాలివే..
Tecno Spark Go 3 Pro
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త రియర్ కెమెరా మాడ్యూల్ ఉండొచ్చు
- టెక్నో స్పార్క్ గో 3 ప్రో 5,100mAh బ్యాటరీ సెటప్
- ఆగస్టు 28న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే ఛాన్స్
Tecno Spark Go 3 Pro : కొత్త టెక్నో ఫోన్ కిర్రాక్ ఉంది.. ఈ చైనా బ్రాండ్ టెక్నో త్వరలోనే భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. కొన్ని లీక్‌ల ప్రకారం.. టెక్నో స్పార్క్ గో 3 ప్రో స్పెసిఫికేషన్లన కంపెనీ రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త డిజైన్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉండొచ్చు. టెక్నో స్పార్క్ గో 3 ప్రోలో 5,100mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. అయితే, టెక్నో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలను ఇంకా వెరిఫై చేయలేదు.
ఆగస్టు 28నే లాంచ్ :
టెక్నో స్పార్క్ గో 3 ప్రో ఆగస్టు 28న భారత మార్కెట్లో లాంచ్ కానుందని టిప్‌స్టర్ వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉంది. బ్రైట్ రెడ్ కలర్ ఆప్షన్లలో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్లో రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్లో సింగిల్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ కెమెరా మాడ్యూల్ ప్రస్తుతం టెక్నో స్పార్క్ గో 3 కన్నా భిన్నంగా ఉంది.
టెక్నో స్పార్క్ గో 3 ప్రో ఈఈసీ టీయూవీ వెరిఫికేషన్ డేటాబేస్‌లలో కనిపించింది. 5,100mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఈ ఏడాది జనవరిలో (Tecno Spark Go 3 Pro) భారత మార్కెట్లో టెక్నో స్పార్క్ గో 3, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 చిప్సెట్తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Read Also : POCO F9 Series : కొత్త పోకో F9 సిరీస్ వచ్చేస్తోంది.. ప్రో, అల్ట్రా అదుర్స్, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!
కెమెరా ఫీచర్లు హైలెట్ :
టెక్నో స్పార్క్ గో 3లో డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 13MP సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. 2K రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేయొచ్చు. ఇందులో ఏఐ క్యామ్ బ్యూటీ, పోర్ట్రెయిట్, సూపర్ నైట్, డ్యూయల్ వీడియో, ప్రో పనోరమా కెమెరా మోడ్స్ ఉన్నాయి.
ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. 3జీ, 4జీ, Wi-Fi, జీపీఎస్ యూఎస్బీ టైప్-సి పోర్ట్‌ను అందిస్తుంది. ఇందులో టెక్నో ఎలా వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. టెక్నో స్పార్క్ గో 3 5,000mAh బ్యాటరీ, 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ ఆఫ్‌లైన్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. తద్వారా వినియోగదారులు నెట్వర్క్ కనెక్షన్ లేకుండా కూడా 1.5 కిలోమీటర్ల రేంజ్లో ఇతర టెక్నో యూజర్లతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు.
