Redmi Note 15 Pro 5G : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. 200MP కెమెరా రెడ్‌మి ఫోన్ భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే?

Redmi Note 15 Pro 5G : రెడ్‌మి నోట్ 15 ప్రో 5జీ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. గతంలో లేనంత తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. 200MP కెమెరాతో వచ్చిన ఈ రెడ్‌మి ఫోన్‌ ప్రారంభ ధర కన్నా చౌకైన ధరలో లభిస్తోంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.. పూర్తి వివరాలివే..

Redmi Note 15 Pro 5G

  • రెడ్‌మి నోట్ 15 ప్రో 5జీ అతి చౌకైన ధరకే
  • 200MP కెమెరా, 6,500mAh బ్యాటరీ, 12GB ర్యామ్
  • 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌

Redmi Note 15 Pro 5G : కొత్త రెడ్‌మి ఫోన్ కొంటున్నారా? 200MP కెమెరాతో రెడ్‌మి ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ రెడ్‌మి ఫోన్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ చైనీస్ ఫోన్ రెడ్‌మి నోట్ 15 సిరీస్‌‌లో ఒకటి.

ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో భారీ అమోల్డ్ డిస్‌ప్లే, 12GB ర్యామ్, పవర్‌ఫుల్ 6,500mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెడ్‌మి కేవలం కొన్ని వారాల క్రితమే ఈ ఫోన్ ధరను భారీగా పెంచింది. కానీ, ఇదే ఫోన్‌ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

రెడ్‌మి నోట్ 15 ప్రోపై ఆఫర్లు :
ఈ మిడ్-బడ్జెట్ రెడ్‌మి ఫోన్ 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB అనే 2 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 31,999 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 33,999గా ఉంది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, సిల్వర్ యాష్ మిరాజ్ బ్లూ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : BSNL Cheapest Plan : BSNL చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. జస్ట్ రూ. 51కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 28 రోజులు ఎంజాయ్..

ఈ రెడ్‌మి ఫోన్‌ (Mi.com)లో మీకు రూ. 3వేల వరకు తగ్గింపు లభిస్తుంది. భారత మార్కెట్లో రూ.29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ధర పెంపు తర్వాత ఇప్పుడు రూ. 31,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. మీరు HDFC బ్యాంక్‌తో రెడ్‌మి వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ. 28,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర కన్నా తక్కువకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

రెడ్‌మి నోట్ 15 ప్రో ఫీచర్లు :
ఈ చైనీస్ కంపెనీ ఫోన్ 1.5K రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే భారీ 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్ 256GB స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పవర్‌ఫుల్ 6,580mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది.

రెడ్‌మి నోట్ 15 ప్రో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ 5G సిమ్ కార్డులు, వై-ఫై బ్లూటూత్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.