Redmi Note 15 SE 5G : వావ్.. రెడ్‌మి 5G ఫోన్ అదుర్స్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఏఐ ఫీచర్లు కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

Redmi Note 15 SE 5G : కొత్త రెడ్‌మి ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. రెడ్‌మి నోట్ 15 SE ఈరోజు ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో ఈ 5జీ ఫోన్ ధర, ఆఫర్లు వివరాలపై ఓసారి లుక్కేయండి.

Redmi Note 15 SE 5G

  • రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్ అమోల్డ్ డిస్‌ప్లే
  • రెడ్‌మి 50MPప్రైమరీ కెమెరాతో పాటు మరెన్నో ఆఫర్లు
  • 5,800mAh బ్యాటరీ, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్

Redmi Note 15 SE 5G : షావోమీ లవర్స్ కోసం అద్భుతమైన సేల్ ఆఫర్.. సబ్ బ్రాండ్ రెడ్‌మి భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ ఫస్ట్ సేల్‌ ప్రారంభమైంది. గత వారమే లాంచ్ అయిన ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. రెడ్‌మి నోట్ 15 స్పెషల్ ఎడిషన్ ధర, ఆఫర్లు స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ 5జీ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ బేస్ వేరియంట్ ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే హై రేంజ్ మోడల్ 8GB+128GB, 8GB+256GB ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ల ధరలు వరుసగా రూ. 25,999 నుంచి రూ. 27,999గా ఉన్నాయి.

ప్రస్తుతం సేల్ సందర్భంగా రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా , 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999గా ఉంది.

Read Also : Apple iPhone 17 : బిగ్ డిస్కౌంట్.. జస్ట్ రూ. 2వేలు కట్టి కొత్త ఐఫోన్ 17 ఇంటికి తెచ్చుకోండి.. ఇంత చౌకగా మళ్లీ దొరకదు..!

ఐసీఐసీఐ కార్డ్ పేమెంట్లపై రూ.2వేల తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తుంది. 6 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ సేల్స్ షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 15 ఎస్ఈలో FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్ అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీ ఉంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 15 ఎస్ఈ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్, NFC, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65,IP66 రేటింగ్‌ అందిస్తుంది. ఏఐ ఎరేస్, ఏఐ స్కై, ఏఐ బోకె, ఏఐ బ్యూటిఫై, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవల్ వంటి ఏఐ ఆధారిత టూల్స్ ఉన్నాయి.