Redmi Note 17 Sale : ఖతర్నాక్ ఫోన్ భయ్యా.. కొత్త రెడ్‌మి నోట్ 17పై స్పెషల్ డిస్కౌంట్.. ధర జస్ట్ ఎంతంటే?

Redmi Note 17 Sale : భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ గత వారమే లాంచ్ కాగా పవర్‌ఫుల్ 8000mAh బ్యాటరీతో వస్తుంది. ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.

Redmi Note 17 Sale

  • రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం
  • 8000mAh బ్యాటరీతో తగ్గింపు ధరకే లభ్యం
  • రూ. 3వేలు డిస్కౌంట్, స్పెషల్ లాంచ్ ఆఫర్

Redmi Note 17 Sale : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ రెడ్‌మి ఫోన్‌లో పవర్‌ఫుల్ 8000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌ గత నెలలో రెడ్‌మి నోట్ 17 ప్రోతో పాటు చైనా మార్కెట్‌లో లాంచ్ అయింది. కంపెనీ నోట్ 17 ప్రో మాక్స్ మోడల్‌ పై వర్క్ చేస్తోంది. అయితే, రెడ్‌మి 17 ప్రో ఫోన్‌ ఫస్ట్ సేల్‌లో రూ. 3వేలు తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ స్పెషల్ లాంచ్ ఆఫర్‌ కూడా అందిస్తోంది.

రెడ్‌మి నోట్ 17 5జీపై ఆఫర్లు :
ఈ మిడ్-బడ్జెట్ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో 2 స్టోరేజ్ వేరియంట్లలో (Redmi Note 17 Sale) లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 128GBతో వస్తుంది. ప్రారంభ ధర రూ. 27,999 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 30,999గా ఉంది.

ఆర్కిటిక్ బ్లూ, డార్క్ నైట్, స్టార్‌లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో కొనేసుకోవచ్చు. కంపెనీ ఫస్ట్ సేల్‌లో ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3వేలు డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్‌, కంపెనీ అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో కూడా లభ్యమవుతోంది.

Read Also : Vivo X300 FE Price : వివో లవర్స్‌కు బిగ్ షాక్.. వివో X300 FE ధర రూ.10 వేలు పెంపు.. ఐఫోన్ 17 కన్నా ఖరీదే!

6GB ర్యామ్ + 128GB : రూ. 27,999
8GB ర్యామ్ + 128GB : రూ. 30,999

రెడ్‌మి నోట్ 17 ఫీచర్లు :
ఈ రెడ్‌మి ఫోన్‌లో FHD+ (1080 x 2396 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. అంతేకాదు.. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని అందించింది.

ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. 8000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది.

ఈ రెడ్‌మి ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, ఒక సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ బ్యాక్ కెమెరా 2x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 8MP కెమెరా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, USB టైప్-సి వంటి ఫీచర్లను అందిస్తుంది.