Redmi Turbo 5 Launch : వివో, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లకు పోటీగా రెడ్‌మి టర్బో 5 ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లపై భారీ అంచనాలివే!

Redmi Turbo 5 Launch : ఈ రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్‌ఓఎస్3పై రన్ అవుతుంది. వివో, శాంసంగ్, వన్ ప్లస్ ఫోన్లకు పోటీగా వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

Redmi Turbo 5 Launch ( Image Credit : AI )

  • దేశంలో రాబోయే ఫస్ట్ రెడ్‌మి టర్బో స్మార్ట్‌ఫోన్ ఇదే
  • 6.59-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉంది
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌

Redmi Turbo 5 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. అతి త్వరలో భారత మార్కెట్లోకి రెడ్‌మి టర్బో 5 పేరుతో లాంచ్ కానుంది. దేశంలో రానున్న ఫస్ట్ రెడ్‌మి టర్బో స్మార్ట్‌ఫోన్ ఇదే. రెడ్‌మి టర్బో 5 స్పెసిఫికేషన్లు చైనీస్ వేరియంట్‌ను మాదిరిగా ఉంటాయని భావిస్తున్నారు.

టిప్‌స్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని అంచనా. భారత మార్కెట్లో రెడ్‌మి టర్బో 5 త్వరలో లాంచ్ కానుందని షావోమీ కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ద్వారా విక్రయించనుంది.

రెడ్‌మి టర్బో 5 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ రెడ్‌మి ఫోన్ స్పెసిఫికేషన్లు గత జనవరిలో చైనాలో లాంచ్ అయిన వేరియంట్‌ను మాదిరిగా ఉండే అవకాశం ఉంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కోసం మైక్రోసైట్‌ కూడా ఉంది. రెడ్‌మి టర్బో 5 ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌లో రైట్ బాటమ్ కార్నర్‌లో కంపెనీ బ్రాండింగ్ ఉంటుంది. పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉంటాయి.

చైనాలో రెడ్‌మి టర్బో 5లో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 3,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది.

Read Also : PF Claim Online : ఉద్యోగులకు పండగే.. ఇక కంపెనీతో పనిలేదు.. PF డబ్బులు ఈజీగా తీసుకోవచ్చు.. ఎలాగంటే?

రెడ్‌మి టర్బో 5లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరా ఉంది. రెడ్‌మి టర్బో 5 ఫోన్ 7,560mAh బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. రెడ్‌మి K90 మ్యాక్స్ ఇటీవలే లాంచ్ అయింది. ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 165Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.83-అంగుళాల (1,280×2,772 పిక్సెల్స్) M10 డిస్‌ప్లే ఉంది.

రెడ్‌మి K90 మ్యాక్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,550mAh బ్యాటరీ ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది.