Jio Gaming Plan : గేమ్ ఛేంజర్ ప్లాన్.. జియో కొత్త ప్లాన్ అదిరిందిగా.. 28 రోజులు మీ గేమ్ ఇష్టం.. ఫుల్ ఎంజాయ్!

Jio Gaming Recharge Plan : జియో యూజర్ల కోసం కొత్త గేమింగ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. జియో రూ. 459 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ప్లాన్ ఎలా పొందాలంటే?

Jio Gaming Recharge Plan

  • జియో రూ. 459 ప్లాన్ 28 రోజులు, రోజుకు 2GB డేటా, అదనంగా 5GB డేటా
  • స్నాప్‌చాట్+, గూగుల్ జెమిని కూడా యాక్సస్ చేయొచ్చు
  • మైజియో యాప్, వెబ్‌సైట్, రిటైల్ స్టోర్‌లలో ఈజీగా రీఛార్జ్ చేయొచ్చు
  • గేమింగ్ ఇష్టపడే జియో యూజర్లకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్

Jio Gaming Recharge Plan : జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ముఖ్యంగా గేమింగ్ ఇష్టపడే యూజర్ల కోసం కొత్త గేమింగ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. జియో రూ. 459 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ అందిస్తోంది.ఈ ప్లాన్ యూజర్ల డేటా, కాల్స్‌తో పాటు అనేక ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది.

ఈ ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 2GB డేటాతో పాటు, అదనంగా 5GB బోనస్‌ను కూడా అందిస్తుంది. మూవీలు చూడటం లేదా గేమ్‌లు ఆడటం ఇష్టపడేవారికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.

డేటా, కాల్స్‌తో పాటు వినియోగదారులు స్నాప్‌చాట్ ప్లస్, గూగుల్ జెమిని సర్వీసులను కూడా పొందవచ్చు. వినియోగదారులు మైజియో యాప్, అధికారిక వెబ్‌సైట్ లేదా ఏదైనా రిటైల్ స్టోర్ ద్వారా ఈ సర్వీసును రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి యాక్టివేట్ చేశాక ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని బెనిఫిట్స్ వెంటనే అందుబాటులోకి వస్తాయి. జియో రూ. 459 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Apple iPhone 17 : ఏంది భయ్యా ఆఫర్.. ఇంత తక్కువకే ఐఫోన్ వస్తే ఎలా వదిలేస్తారు బ్రో.. కొత్త ధర ఎంతంటే?

జియో రూ. 459 ప్లాన్ బెనిఫిట్స్ :
రూ. 459 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 28 రోజుల పాటు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అదనంగా 5GB డేటా బోనస్ లభిస్తుంది. రూ. 459 ప్యాక్, గేమర్‌లకు, స్ట్రీమింగ్ ప్రియులకు సాధారణ డేటా ప్లాన్ కన్నా ఎక్కువ డేటాను అందిస్తుంది. ఈ రూ. 459 ప్యాక్‌లో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు కూడా ఉంటాయి.

స్నాప్‌చాట్+ మెంబర్‌షిప్‌తో సబ్‌స్క్రైబర్‌లు స్నాప్‌చాట్‌లోని ఫీచర్‌లకు స్పెషల్ యాక్సెస్‌ అందిస్తుంది. గేమర్లు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు అవసరం లేకుండానే జియోగేమ్స్ నుంచి గేమ్‌లు ఆడవచ్చు. క్లౌడ్ గేమింగ్‌ ట్రై చేయొచ్చు. రూ. 459 ప్యాక్‌లో గూగుల్ జెమిని సర్వీసులు ఉన్నాయి.

జియో రూ. 459 ప్లాన్‌తో రీఛార్జ్ ఎలా? :
రూ. 459 ఆఫర్‌ ద్వారా రీఛార్జ్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మైజియో (MyJio) యాప్‌ ద్వారా ఈ ఆఫర్ ప్రీపెయిడ్ ఆఫర్ల కేటగిరీ కింద లిస్ట్ అయింది. ప్రత్యామ్నాయంగా, మీ ఫోన్ నంబర్‌ ఉపయోగించి రిలయన్స్ జియో వెబ్‌సైట్ ద్వారా కూడా ఫోన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే, ఆఫ్‌లైన్‌లో ఈ ఆఫర్‌ పొందాలంటే రిటైల్ స్టోర్లకు వెళ్లాల్సి ఉంటుంది.