Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారులకు ప్రపంచ-స్థాయి సేవలను అందించేందుకు ప్రీపెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. ఎంచుకున్న జియో పోస్ట్‌పెయిడ్, జియో ఫైబర్ ప్లాన్లలో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే, ప్రీపెయిడ్ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండటం ఇదే మొదటిసారి. 400 మిలియన్లకు పైగా జియో ప్రీపెయిడ్ కస్టమర్లు జియో ప్రీపెయిడ్ బండిల్ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోతో కొత్త ప్రీపెయిడ్ బండిల్ భాగస్వామ్యం మరింత మంది యూజర్లకు యాక్సెస్‌ని అందిస్తుంది.
రిలయన్స్ జియో రెండు ప్లాన్లలో రూ. రూ. 1,099.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రూ. 1,499 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్స్క్రిప్షన్, అన్లిమిటెడ్ 5G డేటా, రోజుకు 2GB 4G డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్‌లను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యూజర్ల కోసం నెలకు రూ.149 చెల్లిస్తే.. మొబైల్ ఫోన్లలో మాత్రమే కంటెంట్‌ని చూసేందుకు అనుమతిస్తుంది.
Reliance Jio Plans Reliance Jio Plans, Reliance Jio mobile Plans
హై ఎండ్ ప్లాన్ రూ. 1,499 ద్వారా నెట్‌ఫ్లిక్స్ ప్రైమరీ ఫీచర్‌ను అందిస్తుంది. వినియోగదారులు ఒకేసారి మొబైల్ లేదా టెలివిజన్‌లో చూసేందుకు అనుమతిస్తుంది. తక్కువ-ధర వెర్షన్ వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. కానీ, రోజుకు 3GB 4G డేటాను అందిస్తుంది.నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ విడిగా రూ. 199 నెలకు పొందవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 84 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటా ప్లాన్ ధర రూ. 719, 3GB డేటాతో అదే ప్లాన్ ధర రూ. 999కు అందిస్తుంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో, నెట్‌ఫ్లిక్స్ బీస్ట్, గాడ్ ఫాదర్, ధమాకా, లవ్ టుడే, మేజర్, దసరా, విరూపాక్షం వంటి టైటిల్లతో సహా తమిళ, తెలుగు భాషా చిత్రాల అద్భుతమైన లైనప్‌ను ప్రకటించింది. ప్రత్యేకించి, బండిల్ చేసిన టెల్కో ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ మైలురాయిని సూచిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్లు రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఔత్సాహికులు, జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఈ వినూత్న బండిల్ ప్లాన్లు వినోదం, కనెక్టివిటీని అందిస్తాయి.