Reliance Jio : జియో కొత్త చీపెస్ట్ ప్లాన్.. ఇక 28 రోజులు కాదు.. నెలంతా ఎంజాయ్ చేయొచ్చు.. రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!

Reliance Jio : జియో పూర్తి నెల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ అందిస్తోంది. 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ కేవలం రూ. 339కే పొందవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Jio New plan 399

  • జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
  • రూ. 339తో ఇక 28 రోజులు కాదు.. పూర్తి నెల వ్యాలిడిటీ
  • రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్

Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ వచ్చేసింది. ఇకపై రోజులతో పనిలేకుండా నెలవారీగా వ్యాలిడిటీతో కొత్త రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. అది కూడా చాలా చౌకైన ధరకే.. ఇప్పటినుంచి క్యాలెండర్ నెల (30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో జియో రీఛార్జ్ ప్లాన్లను అందించనుంది. రోజుకు 1.5 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాదు.. మరెన్నో అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.

ఇక 28 రోజులు కాదు.. 30 రోజులు వ్యాలిడిటీ :

సాధారణంగా, రీఛార్జ్ ప్లాన్‌లకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే, కస్టమర్ల డిమాండ్ మేరకు జియో ఇప్పుడు రూ. 339కే ఒక కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. మీరు ఈరోజు రీఛార్జ్ చేస్తే.. అది వచ్చే నెల అదే తేదీ వరకు వ్యాలిడ్ అవుతుంది. అంటే ఆ నెలలో ఎన్ని రోజులు ఉన్నా సరే మొత్తం నెల వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు :

ధర : రూ. 339 ప్లాన్
వ్యాలిడిటీ : పూర్తి క్యాలెండర్ నెల.
డేటా : రోజుకు 1.5GB (1.5GB/Day).
కాల్స్ : అన్‌లిమిటెడ్ లోకల్ STD కాల్స్.
SMS : రోజుకు 100 ఎస్ఎంఎస్

జియోటీవీ, జియోటీవీ AI క్లౌడ్ యాప్‌లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. అలాగే రూ. 14.95 విలువైన అదనపు టాక్ టైమ్‌ను కూడా అందిస్తుంది. ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు.

ఈ మార్పుకు కారణం ఏంటి? :

ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా పార్లమెంటులో రీఛార్జ్ ప్లాన్‌ల 28 రోజుల కాలపరిమితిని ప్రశ్నించారు. నెలలో 30 రోజులు ఉన్నప్పటికీ, రీఛార్జ్‌ను 28 రోజులకు పరిమితం చేయడం వల్ల సామాన్యుడిపై అదనపు భారం పడుతోందని ఆయన వాదించారు.

Read Also : వావ్.. రెడ్‌మి 5G ఫోన్ అదుర్స్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఏఐ ఫీచర్లు కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

ఈ నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెల్కోలు తప్పనిసరిగా పూర్తి నెల వ్యాలిడిటీతో ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు ఇప్పుడు కొత్త ప్లాన్‌లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.

ప్రతి నెలా 28 రోజుల వ్యాలిడిటీనే ఎందుకు? :

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంటులో టెలికాం రీఛార్జ్ ప్లాన్‌ల వ్యాలిడిటీ అంశాన్ని లేవనెత్తారు. నెల 30 రోజులు ఉన్నప్పటికీ, రీఛార్జ్ వ్యాలిడిటీని కేవలం 28 రోజులకు మాత్రమే ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. దీని కారణంగా వినియోగదారులు సంవత్సరానికి 12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోందని ఆయన అభ్యంతరం తెలిపారు.

రీఛార్జ్ ప్లాన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పూర్తి నెల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్‌లను అందించేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కీలక ఉత్తర్వు జారీ చేసింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా ‘క్యాలెండర్ నెల’ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావాలని ఆదేశించింది.