Jio Offers : జియోనా మజాకా.. చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. ఏకంగా 200 రోజులు.. ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా..!

Jio Offers : జియో ఇప్పుడు 200 రోజుల పాటు రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

Jio offer

Jio Offers : డేటా సంచలనం, రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, BSNL టెలికం కంపెనీలకు పోటీగా జియో సరసమైన ప్లాన్ తీసుకొచ్చింది. జియో యూజర్లు ఇకపై నెల లేదా మూడు నెలలు, 90 రోజులు రీఛార్జ్ ప్లాన్లలపై ఆధారపడాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏకంగా 200 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఇటీవలే జియో లాంగ్-వాలిడిటీ ప్లాన్‌లను విస్తరించింది.

Read Also : BYD EV Cars : కొత్త EV కారు కోసం చూస్తున్నారా? తెలంగాణకు BYD ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్.. 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్.. టెస్లా కన్నా తోపు!

జియో కస్టమర్‌లు సింగిల్ రీఛార్జ్ ద్వారా 200 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ కాల్స్, రోజుకు 2.5GB హైస్పీడ్ డేటాను ఎంజాయ్ చేయొచ్చు. జియో లైనప్‌లో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ, ప్రీమియం ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి.

84 రోజులు, 90 రోజులు, 98 రోజులు లేదా ఏడాది మొత్తం వ్యాలిడిటీ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. అయితే, మీరు వార్షిక ప్లాన్‌ కాకుండా లాంగ్ వ్యాలిడిటీ కోసం చూస్తుంటే.. 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ 200 రోజుల ప్లాన్ అనేక బెనిఫిట్స్ కలిగి ఉంది. కస్టమర్‌లు అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, 5G డేటా, ఫ్రీ SMS పొందుతారు.

ఇంతకీ జియో అందించే 200 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 2025కు అందిస్తోంది. ఈ ప్లాన్ జియో టాప్ 5G రీఛార్జ్ ఆప్షన్లలో ఒకటి. జియో యూజర్లు ఒకసారి ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే 200 రోజుల పాటు 100 ఫ్రీ SMSలతో పాటు మొత్తం 500GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. రోజుకు 2.5GB డేటా వినియోగించుకోవచ్చు. మీ రోజువారీ డేటా లిమిట్ మించినా ఇంటర్నెట్ యాక్సెస్ తక్కువ స్పీడ్‌తో ఉంటుంది.

ఈ రీఛార్జ్ ప్లాన్‌ను యాక్టివేట్ చేశాక యూజర్లు జియో హాట్‌స్టార్‌కు ఫ్రీగా 90 రోజుల సబ్‌స్ర్కిప్షన్ పొందుతారు. లేటెస్ట్ మూవీలు, వెబ్ సిరీస్‌లకు యాక్సస్ చేయొచ్చు. అంతేకాకుండా, జియో ఈ ప్లాన్‌లో 50GB వరకు AI క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది.

Read Also : UPI New Rules : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి UPI కొత్త రూల్స్.. మీ బ్యాంకు రూల్స్ మారబోతున్నాయి.. చెక్ చేసుకోండి!

వినియోగదారులు తమ ఫోన్లలో స్టోరేజీ అయిపోతుందనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జియో టీవీకి ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఇకపై జియో కస్టమర్‌లు లైవ్ టీవీ ఛానెల్స్, వివిధ రకాల ఆకర్షణీయమైన టీవీ ప్రోగ్రామ్‌లను కూడా చూడవచ్చు.