BYD EV Cars : కొత్త EV కారు కోసం చూస్తున్నారా? తెలంగాణకు BYD ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్.. 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్.. టెస్లా కన్నా తోపు!

BYD EV Cars : తెలంగాణకు చైనా ఎలక్ట్రిక్ దిగ్గజం BYD రాబోతుంది. అతి త్వరలో హైదరాబాద్‌‌లో BYD కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే.. టెస్లా మించిన ఛార్జింగ్ టెక్నాలజీతో BYD ఎలక్ట్రిక్ కార్లు మన దగ్గరే తయారు కానున్నాయి.

BYD EV Cars : కొత్త EV కారు కోసం చూస్తున్నారా? తెలంగాణకు BYD ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్.. 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్.. టెస్లా కన్నా తోపు!

Electric Vehicle Giant BYD Proposes

Updated On : March 26, 2025 / 11:54 AM IST

BYD EV Cars : BYD ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఇకపై తెలంగాణలోనే BYD ఎలక్ట్రిక్ కార్లు తయారు కానున్నాయి. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ (BYD) అతి త్వరలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తీసుకురానుంది. అందులోనూ మన హైదరాబాద్‌లోనే BYD ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Read Also : iPhone 16 Pro Max : ఆపిల్ క్రేజే వేరబ్బా.. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ ధర భారీగా తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!

నివేదికల ప్రకారం.. ఈవీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గతకొంతకాలంగా జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. రాష్ట్రంలో అవసరమైన భూమి కేటాయింపుతో సహా ఫ్యాక్టరీ యూనిట్ ఏర్పాటుకు BYDకి పూర్తి మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలిసింది.

హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలాల పరిశీలన :
ఈ యూనిట్ కోసం హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో 3 ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం BYD ప్రతినిధులు ఈ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఏదైనా ఒక చోట స్థలాన్ని ఎంచుకున్న తర్వాత ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ పెట్టుబడులలో ఒకటిగా నిలుస్తుంది. తద్వారా తెలంగాణకు పారిశ్రామికంగా మరింత గుర్తింపును తీసుకురానుంది. BYD హైదరాబాద్‌లో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే.. అనేక అనుబంధ పరిశ్రమలు కూడా ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో గణనీయమైన ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం, BYD చైనా నుంచి వెహికల్స్ దిగుమతి చేసుకుని భారత్‌లోనే విక్రయిస్తుంది. అధిక దిగుమతి సుంకాల కారణంగా ఈ వాహనాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో BYD అమ్మకాలను భారీగా ప్రభావితం చేసింది.

హైదరాబాద్‌లో తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల వాహన ఖర్చులు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. టెస్లా అమ్మకాలు చైనా, యూరోపియన్ దేశాలలో తగ్గుతున్నాయని నివేదించినా BYD అమ్మకాలు మాత్రం జోరుగా పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

5 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. 400కి.మీ రేంజ్ :
5 నుంచి 8 నిమిషాల్లో కారు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగల మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్‌ను కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. ఈ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంతేకాదు.. కార్ల తయారీ యూనిట్‌తో పాటు BYD 20గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Read Also : IT Returns Refund : ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

అమ్మకాల్లో టెస్లా కన్నా తోపు :
చైనా కంపెనీ BYD గత సంవత్సరం బ్యాటరీ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు 40శాతం పెరగడంతో రికార్డు స్థాయిలో 777.1 బిలియన్ యువాన్లు (107 బిలియన్ డాలర్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. నివేదిక ప్రకారం.. BYD ఈ వారం ప్రారంభంలో క్విన్ L EV సెడాన్‌ను రిలీజ్ చేసింది. టెస్లా మోడల్ 3ని పోలి ఉండే మిడ్ రేంజ్ మోడల్. కానీ, ధరలో సగం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది.

టెస్లా 2024 ఆదాయం దాదాపు 97.7 బిలియన్ డాలర్లు. గత సంవత్సరం BYD నికర లాభం దాదాపు 40 బిలియన్ యువాన్లు (5.6 బిలియన్ డాలర్లు), గత ఏడాది కన్నా 34 శాతం ఎక్కువ. గత వారమే కంపెనీ సూపర్ ఫాస్ట్ EV ఛార్జింగ్ సిస్టమ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందని చెబుతోంది.