IT Returns Refund : ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

IT Returns Refund : ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేశారా? అయితే, మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌‌కు సంబంధించి రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..

IT Returns Refund : ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

IT Returns Refund

Updated On : March 26, 2025 / 11:08 AM IST

IT Returns Refund : ఆదాయపు పన్ను రిటర్న్ (ITR-U) దాఖలు చేసేందుకు లాస్ట్ డేట్ మార్చి 31, 2025. ఈ తేదీలోపు రిటర్న్ దాఖలు పన్నుచెల్లింపుదారులు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-2025) ముగిసే నాటికి టాక్స్ పేయర్లు ఆదాయ పన్నుకు సంబంధించి అన్ని చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Read Also : iPhone 16 Pro Max : ఆపిల్ క్రేజే వేరబ్బా.. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ ధర భారీగా తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!

మీరు ఇప్పటికే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? అయితే, ఫైలింగ్ చేసిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ రిఫండ్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫైలింగ్ తర్వాత రీఫండ్ ఎప్పటిలోగా వస్తుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుందాం.

ఐటీఆర్ అంటే ఏంటి? :
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అనేది ఒక ఉద్యోగి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించే పత్రం. ఇందులో ఒక వ్యక్తి ఆదాయం, చెల్లించాల్సిన పన్నులు ఉంటాయి. మీ ITR ఫారమ్‌లో అందించిన సమాచారం ఉంటుంది.

పన్ను చెల్లింపుదారులకు చెల్లించిన బకాయి మొత్తాన్ని (టీడీఎస్, టీసీఎస్, ముందస్తు పన్ను) మించి ఉంటే.. ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపుదారుడు పొందే రీఫండ్‌ను ఐటీ రీఫండ్ అంటారు. ఐటీ శాఖ అంచనా సమయంలో అన్ని మినహాయింపులు, డిడెక్షన్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాత వ్యక్తి చెల్లించాల్సిన పన్నును లెక్కిస్తారు.

ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • ఐటీఆర్ ఫైలింగ్ చేసిన తర్వాత టాక్స్ పేయర్లు ఆదాయపన్ను రీఫండ్ స్టేటస్ చేసుకోవచ్చు.
  • ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లండి.
  • హోమ్‌పేజీలో మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
  • వ్యక్తిగత యూజర్ల కోసం పాన్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ చేయాలి.
  • ఒకవేళ ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే పాప్-అప్ మెసేజ్ వస్తుంది.
  • లాగిన్ అయ్యాక ఇ-ఫైల్ సెక్షన్ నావిగేట్ చేసి, ‘Income Tax Returns’ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ‘View Filed Returns’ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • మీకు అవసరమైన అసెస్‌మెంట్ సంవత్సరానికి రీఫండ్ స్టేటస్ చూడవచ్చు.
  • ITR ఫైలింగ్ చేసిన వినియోగదారులు ‘View Details’ ఆప్షన్‌పై కూడా క్లిక్ చేయవచ్చు.

పన్ను చెల్లింపుదారులు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) అధికారిక వెబ్‌సైట్‌లో కూడా రీఫండ్ స్టేటస్ చెక్ చేయవచ్చు. NSDL వెబ్‌సైట్‌లో మీ పాన్, అసెస్‌మెంట్ సంవత్సరం, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. మీ రీఫండ్ స్టేటస్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు యాక్సస్ లేని వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఎన్ని రోజులు పడుతుంది? :
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. “పన్ను చెల్లింపుదారుడు రిటర్న్‌ను ఇ-వెరిఫై తర్వాతే పన్ను శాఖ ద్వారా రీఫండ్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. సాధారణంగా, రీఫండ్ పన్ను చెల్లింపుదారుడి ఖాతాకు క్రెడిట్ అయ్యేందుకు కనీసం 4 నుంచి 5 వారాలు పడుతుంది.

Read Also : Apple Watch : అదిరిందయ్యా Apple.. వాచ్‌కే కెమెరా, AI కూడా.. ఎప్పుడు వస్తుందంటే..?

అయితే, ఈ వ్యవధిలో రీఫండ్ అందకపోతే.. పన్ను చెల్లింపుదారుడు ITRలో ఏదైనా మిస్టేక్స్ సంబంధించిన సమాచారం కోసం చెక్ చేయాలి. రీఫండ్‌కు సంబంధించి IT సెక్షన్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా లేదో మీ రిజిస్టర్డ్ ఇమెయిల్‌ను చెక్ చేయాలి. ఇలా పై విధంగా పన్ను చెల్లింపుదారుడు ఇ-ఫైలింగ్‌లో రీఫండ్ స్టే్టస్ చెక్ చేయవచ్చు.