iPhone 16 Pro Max : ఆపిల్ క్రేజే వేరబ్బా.. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర భారీగా తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!
iPhone 16 Pro Max : ఆపిల్ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. రూ.9వేలు తగ్గింపుతో ఈ ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..

iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ప్రీమియం ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా కలిగి ఉంది. ఈ ఐఫోన్ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఐఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతం అమెజాన్ సహా పలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాల్లో ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్‌ప్లే :
ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్ 6.9 అంగుళాల డిస్‌ప్లే, 1320 x 2868 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రోలింగ్ లేదా గేమింగ్ సమయంలో స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ మల్టీ టాస్కింగ్‌తో హై యూజర్ ఎంగేజ్మెంట్ అందిస్తుంది. అద్భుతమైన స్క్రీన్‌లలో ఒకటైన ఈ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ స్క్రీన్ డైనమిక్ కలర్, హై బ్రైట్‌నెస్ కలిగి ఉంది.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ ప్రాసెసర్ :
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బయోనిక్ A18 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. హెక్సా-కోర్ 4.05GHz ప్రాసెసర్ బట్టర్-స్మూత్ మల్టీ టాస్కింగ్, హై-స్పీడ్ గేమింగ్, ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్‌మెంట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ iOS v18 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప్రీ-లోడ్ అయింది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తుంది.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ కెమెరాలు :
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 48MP + 48MP + 12MP సెన్సార్లతో ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. అద్భుతమైన ఫోటోగ్రఫీని అందిస్తాయి. మెరుగైన నైట్ మోడ్ లో లైటింగ్‌లో మెరుగైన ఫొటోలను అందిస్తుంది. టెలిఫోటో లెన్స్ షాట్‌లకు ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. హై-క్వాలిటీ సెల్ఫీలను క్లిక్ చేసేందుకు 4K వీడియోలను రికార్డ్ చేసేందుకు 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, ఇతర స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో 4685mAh లి-అయాన్ బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ రీఛార్జ్ చేయకుండానే రోజంతా వాడొచ్చు. బ్యాటరీ ఖాళీ కాబోతున్నప్పుడు వేగంగా ఛార్జ్ చేయొచ్చు. ఈ ఫోన్‌ను టాప్ అప్ చేసేందుకు సపోర్టు ఇస్తుంది.
స్టోరేజీ విస్తరించే కెపాసిటీ లేనప్పటికీ ఈ మోడల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ 256GB మాత్రమే అందుబాటులో ఉంది. అప్లికేషన్‌లు, మీడియా, డేటా మాత్రమే కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ యాక్టివిటీ, NFC, 5Gకి కూడా సపోర్టు ఇస్తుంది.
ధర, వేరియంట్లు :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర 256GB వేరియంట్‌కు రూ. 1,33,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వేరియంట్లను పరిశీలిస్తే.. 512GB స్టోరేజీ ధర రూ. 1,52,900 ఉండగా, 1TB స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 1,72,900 నుంచి అందుబాటులో ఉంది. ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌లో బ్లాక్, వైట్, బ్లూ అనే 3 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ కొనుగోలు చేయొచ్చు. క్రోమా, ఫ్లిప్‌కార్ట్ కూడా భారీ తగ్గింపు ధరతో ఆఫర్ చేస్తున్నాయి.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై డిస్కౌంట్లు :
బ్యాంక్ ఆఫర్ : ICICI బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 3వేలు డిస్కౌంట్
బ్యాంక్ ఆఫర్ : కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలపై రూ. 3వేలు తగ్గింపు.
ఫోన్ UPI లావాదేవీ : ఫోన్ UPI లావాదేవీపై 1శాతం డిస్కౌంట్ (గరిష్టంగా రూ. 2వేలు)
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ : మీ లావాదేవీపై 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్