Amazon EPL Sale : కొత్త ఫోన్ కావాలా? అమెజాన్‌లో అదిరే సేల్.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Amazon EPL Sale : అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ సందర్భంగా రూ. 20వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని వెంటనే కొనేసుకోండి.

Amazon EPL Sale
Amazon EPL Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ (Amazon Electronics Premier League Sale) నడుస్తోంది. ఈ సేల్ మార్చి 26న ముగియనుంది. అప్పటిలోగా అతి తక్కువ ధరకే మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.
ఈ సేల్ సమయంలో మీరు భారీ డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్లను కొనేందుకు ఇదే సరైన సమయం. అనేక బ్రాండ్ల పాపులర్ ఫోన్లలో రెడ్‌మి నోట్ 14, శాంసంగ్ గెలాక్సీ M35, వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ ఉన్నాయి. ఇందులో కేవలం రూ. 20 వేల లోపు ధరలో మీరు ఏ ఫోన్ అయినా కొనుగోలు చేయవచ్చు. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి..
రెడ్‌మి నోట్ 14 :
అమెజాన్‌లో రెడ్‌మి నోట్ 14 ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 19,999కు కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద ఈ ఫోన్ మరింత తగ్గవచ్చు. ఈ ఫోన్ 120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో కూడా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. బ్యాటరీ 5200mAh ఉండగా, 50MP కెమెరా కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M35 :
శాంసంగ్ గెలాక్సీ M35 ఫోన్ రూ. 20వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర మరింత తగ్గాలంటే బ్యాంక్ ఆఫర్లతో బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ బ్యాక్ కెమెరాతో వస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,998కు కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద ధరను మరింత తగ్గించవచ్చు. 120Hz అమోల్డ్ డిస్‌ప్లే కూడా కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ 695 SoC, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వస్తుంది. అయితే, ఇదే ధరలో కొనుగోలుకు ఇతర స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా ఈ కొత్త ఫోన్ సొంతం చేసుకోవచ్చు.