Reliance Retail launches 'Yousta' fashion stores, first outlet in Hyderabad, all products below Rs 999
Reliance Retail Yousta Stores : ప్రముఖ భారత అతిపెద్ద రిటైలర్, రిలయన్స్ రిటైల్ (Reliance Retail) ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్, యూస్టా (Yousta)ను ప్రారంభించినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో యూస్టా (Yousta) మొదటి స్టోర్‌ను కంపెనీ ప్రారంభించింది. టెక్-ఎనేబుల్ స్టోర్ లేఅవుట్లతో యువతను లక్ష్యంగా చేసుకుని సరసమైన ధరలకు యూస్టా హై-ఫ్యాషన్‌ను అందిస్తుంది.
ఈ యూస్టా స్టోర్‌లో లభించే అన్ని ఉత్పత్తుల ధరలు రూ. 999 కన్నా తక్కువగా ఉంటాయి. ఇందులో మెజారిటీ ధర రూ. 499 కన్నా తక్కువగా ఉంటాయి. హౌసింగ్ యునిసెక్స్ మర్చండైజ్, క్యారెక్టర్ మర్చండైజ్, వీక్లీ రిఫ్రెష్ క్యాప్సూల్‌తో పాటు, యూస్టా ప్రతి వారం ‘Starring Now’ కలెక్షన్లో సరికొత్త ప్రొడక్టులను అందిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ ఫ్యాషన్ మ్యాచింగ్ యాక్సెసరీస్‌తో అన్ని రకాల దుస్తులను అందిస్తుంది.
రిలయన్స్ రిటైలర్ స్టోర్‌లో (Yousta) స్టోర్లు అనేక టెక్ టచ్ పాయింట్లను కలిగి ఉంటాయి. ఇందులో సమాచారాన్ని షేరింగ్ చేసేందుకు QR-ఎనేబుల్డ్ స్క్రీన్లు, సెల్ఫ్-చెకౌట్ కౌంటర్లు, కాంప్లిమెంటరీ Wi-Fi, ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. యూస్టా రేంజ్ ఇప్పుడు హైదరాబాద్‌లోని బ్రాండ్ మొదటి స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ యూస్టా స్టోర్‌ను Ajio, JioMart ద్వారా ఆన్లైన్లో కూడా యాక్సెస్ చేయవచ్చు.
Reliance Retail launches ‘Yousta’ fashion stores, first outlet in Hyderabad, all products below Rs 999
యూస్టా స్టోర్ ప్రారంభించిన సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్ సీఈఓ, ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. రిలయన్స్ రిటైల్, యూస్టా యువ, డైనమిక్ బ్రాండ్ అని అన్నారు. ‘భారత మార్కెట్లో యువ తరానికి తగినట్టుగా అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ అవసరాలను అర్థం చేసుకోవడానికి మా బృందం నిరంతరం పని చేస్తుంది. యూస్టా యువతకు అవసరమైన అన్ని ప్రొడక్టులను యూస్టా స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం. వినియోగదారుల భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ కూడా ఉంటుంది’ అని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు.
వినియోగదారుల కోసం ప్రత్యేకించి యూస్టా ఒక స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆ సంస్థ సాయంతో వినియోగదారులు స్టోర్లలో తమ పాత దుస్తులను అవసరంలో ఉన్నవారికి దానం చేసేందుకు వాటిని కమ్యూనిటీ కార్యక్రమాలకు వినియోగించడానికి వీలుకల్పిస్తుంది. సుస్థిరత, స్థానిక కమ్యూనిటీల పట్ల బ్రాండ్ స్థానికంగా సేకరించి రూపొందించిన ఉత్పత్తులను తన స్టోర్లలో అందుబాటులో ఉంచుతుంది. తద్వారా యూస్టా ప్రత్యేకతతో పాటు స్థానికంగా ఆర్థిక వ్యవస్థలు బలపడేందుకు సాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.