Vodafone idea : Vi యూజర్లకు బంపర్ ఆఫర్.. కేవలం రూ. 99కే అన్‌లిమిటెడ్ డేటా.. మరెన్నో బెనిఫిట్స్..
Vodafone idea : మీరు వొడాఫోన్ ఐడియా కస్టమర్ అయితే అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కోసం వొడాఫోన్ ఐడియా రూ.99 ప్లాన్ మీకోసం అందిస్తోంది. బెనిఫిట్స్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Updated on- June 17, 2026 / 09:09 PM IST
Vodafone idea Plan Offer
- వోడాఫోన్ ఐడియా రూ. 99 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా
- 2 రోజుల పాటు కాలింగ్, SMS బెనిఫిట్స్ కూడా
- Vi అందించే బెస్ట్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ ఇదే
Vodafone idea : మీరు వోడాఫోన్ ఐడియా కస్టమరా? మీకో బంపర్ ప్లాన్ ఆఫర్.. అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కోసం చూస్తున్నారా? వొడాఫోన్ ఐడియా రూ. 99 ప్లాన్ అందుబాటులో ఉంది. Vi నుంచి లభించే బెస్ట్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ అని చెప్పొచ్చు.
మీ ఫోన్‌లో ఏదైనా యాక్టివ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్లాన్‌కు ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు. వొడాఫోన్ ఐడియా (Vodafone idea) రూ. 99 ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వోడాఫోన్ ఐడియా రూ. 99 ప్లాన్ బెనిఫిట్స్ :
వోడాఫోన్ ఐడియా రూ. 99 ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. రెండు రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అందిస్తుంది. ఈ యాడ్-ఆన్ డేటా ప్యాక్ ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ లేదు. మీ ఫోన్లలో ఇప్పటికే ఏదైనా ఒక కరెంట్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి.
Read Also : OnePlus N6 : 8,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ N6 వచ్చేస్తోంది.. ఈ తేదీనే లాంచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
ఈ ప్లాన్‌తో అవుట్‌గోయింగ్ SMS, కాలింగ్ బెనిఫిట్స్ రెండూ రావు. ఈ ప్లాన్ డేటా వినియోగాన్ని రోజుకు 20GBకి అందిస్తుంది. ఈ లిమిట్ దాటాక ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది. ఎయిర్‌టెల్ కూడా ఇలాంటి ప్లాన్‌ను అదే ధరకు ఆఫర్ చేస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 99 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 99 ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 2 రోజుల పాటు వస్తుంది. అయితే, ఈ ప్లాన్‌కు నేరుగా వ్యాలిడిటీ ఉండదు. రీఛార్జ్ చేసే ముందు మీ ఫోన్‌లో కరెంట్ ప్లాన్ వ్యాలిడిటీ ఎన్నిరోజుల వరకు ఉందో చెక్ చేయాలి. రోజువారీ 20GB హై-స్పీడ్ డేటా దాటితే ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది.
