Samsung Galaxy A08 Leak : శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ కేక.. 6,000mAh బ్యాటరీతో దుమ్మురేపుతోంది.. కీలక ఫీచర్లు లీక్..!
Samsung Galaxy A08 Leak : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎ08 ఫోన్ రాబోతుంది. లాంచ్‌కు ముందుగానే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. ధర ఎంత ఉండొచ్చంటే?
- Sreehari A
- Published on- September 12, 2026 / 05:06 PM IST
Samsung Galaxy A08 Leak
- శాంసంగ్ గెలాక్సీ A08 4జీ ఫోన్ భారీ 6000mAh బ్యాటరీ
- 4GB ర్యామ్, 6GB ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్
- బ్రైట్ బ్లూ, సిల్వర్, గ్రీన్ మూడు కలర్ ఆప్షన్లలో రానుంది
Samsung Galaxy A08 Leak : శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. శాంసంగ్ గెలాక్సీ A08 4G సైలెంట్‌గా లిస్టు అయింది. ఈ ఫోన్ యూఏఈలోని రిటైలర్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.7-అంగుళాల పీఎల్ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది.
ఈ కొత్త శాంసంగ్ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా కూడా ఉంది. భారీ 6000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A08 4జీ ధరతో పాటు ఇతర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ధర, లభ్యత :
శాంసంగ్ గెలాక్సీ A08 4జీ ఫోన్ యూఏఈ రిటైలర్ వెబ్‌సైట్‌లో కనిపించింది. 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 625 (దాదాపు రూ. 16,200)గా ఉంది. డార్క్ బ్లూ, సిల్వర్, గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వర్జిన్ మెగాస్టోర్ యూఏఈలో కొనుగోలుకు లిస్టు అయింది.
Read Also : Vivo X300 Pro Deal : ఏంది భయ్యా డిస్కౌంట్.. వివోX300 ప్రోపై దిమ్మతిరిగే ఆఫర్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
లిస్టింగ్ ప్రకారం.. ఈ కొత్త శాంసంగ్ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పీఎల్ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 2.2GHz వరకు క్లాక్ స్పీడ్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గూగుల్ ప్లే కన్సోల్ ప్రకారం.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17తో వస్తుంది. 4GB ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ మైక్రో SD కార్డ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
కెమెరా ఫీచర్లు :
ఈ శాంసంగ్ 4జీ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ కెమెరా అందిస్తుంది. సెల్ఫీల కోసం ఈ శాంసంగ్ ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాతో రన్ అవుతుంది.
బ్యాటరీ ఎంతంటే? :
25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 6000mAh బ్యాటరీ ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8.0mm మందంతో ఉంటుంది.
