Samsung Galaxy A27 : బడ్జెట్‌లో బీస్ట్.. కొత్త శాంసంగ్ గెలాక్సీ A27 వచ్చేస్తోంది.. లీక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా..!

Samsung Galaxy A27 : శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే కీలక ఫీచర్లు, డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలివే..

Samsung Galaxy A27

  • శాంసంగ్ గెలాక్సీ A27 డిజైన్, స్పెషిఫికేషన్లు లీక్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్ పంచ్-హోల్ నాచ్ కటౌట్‌తో అప్‌గ్రేడ్
  • 128GB, 256GB మోడల్ ధరలు ఎంత ఉండొచ్చంటే?

Samsung Galaxy A27 : శాంసంగ్ నుంచి అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్ వస్తోంది. లాంచ్‌కు ముందే శాంసంగ్ చెక్ వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ A27 ప్రొడక్టు పేజీని పబ్లీష్ చేసింది. అయితే, ఈ శాంసంగ్ ఫోన్ పూర్తి వివరాలు ముందే వెల్లడయ్యాయి. ఆ పేజీని తర్వాత డిలీట్ చేసింది.

కానీ, అప్పటికే ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు లీక్ (Samsung Galaxy A27) అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ A27లో చిప్‌సెట్ అప్‌గ్రేడ్, మోడ్రాన్ డిస్‌ప్లే కటౌట్‌, కెమెరాకు సంబంధించి పూర్తి ఫీచర్ల వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం..

శాంసంగ్ గెలాక్సీ A27 స్పెసిఫికేషన్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ A27, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A26లోని టియర్‌డ్రాప్ నాచ్ నుంచి పంచ్-హోల్ కటౌట్‌కు మారింది.

సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నట్లు అంచనా. ఈ ఫోన్ 7.7 మిమీ మందంతో 164 మిమీ x77.5 మిమీ కొలతలతో వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, రోజ్ కలర్ ఆప్షన్లలో రానుంది. పాత జనరేషన్ ఎక్సినోస్ 1280 లేదా 1380 బదులుగా స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ అమర్చారు. ఈ ఫోన్ 6GB లేదా 8GB ర్యామ్, 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. హైబ్రిడ్ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.

రియర్ కెమెరా సిస్టమ్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రావైడ్ 2MP మాక్రో ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP కూడా ఉంది. బ్యాక్, ఫ్రంట్ ప్రైమరీ కెమెరాలు రెండూ 30fps వద్ద 4K వీడియోకు సపోర్ట్ చేస్తాయి. పాత మోడల్ శాంసంగ్ గెలాక్సీ A26తో పోలిస్తే.. 8MP అల్ట్రావైడ్ 5MP కెమెరాకు, సెల్ఫీ కెమెరా 13MP నుంచి 12MPకి తగ్గింది.

Read Also : Vivo V50 Price : పండగ చేస్కోండి.. ఈ వివో ఫోన్ మరి ఇంత తక్కువా.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతో తెలుసా?

శాంసంగ్ గెలాక్సీ A26 మాదిరిగా ఫీచర్లలో ఎలాంటి మార్పులేదు. ఈ ఫోన్‌లోని బ్యాటరీ 5,000mAh సామర్థ్యంతో 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వన్ యూఐ 8.5తో రన్ అవుతుంది. 6 జనరేషన్ ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A27 ఫోన్ IP64 ఇంగ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్‌తో వస్తుంది. డస్ట్ రెసిస్టెన్స్, వాటర్ డ్రాప్స్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.  శాంసంగ్ గెలాక్సీ A26 ఫోన్ IP67 రేటింగ్‌తో వస్తుంది. మీటరు లోతు నీటిలో 30 నిమిషాల పాటు ముంచినా ఫోన్ చెక్కుచెదరదు. బడ్జెట్‌ ఫోన్లలో ఈ రేటింగ్ చాలా బెటర్ అని చెప్పొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A27 ధర (అంచనా) :
ఈ శాంసంగ్ ఫోన్ అధికారిక ధర, లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు. లీకైన సమాచారం ప్రకారం.. 128GB మోడల్ ధర సుమారుగా (EUR349​​) 256GB మోడల్ ధర సుమారుగా EUR439 ఉండవచ్చని అంచనా. రాబోయే కొత్త మోడల్ శాంసంగ్ గెలాక్సీ A26 వేరియంట్‌ కన్నా ధర ఎక్కువే ఉండొచ్చు. భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది క్లారిటీ లేదు.