Samsung Galaxy A36 5G : కొంటే శాంసంగ్ ఫోన్ కొనాలి.. ఈ గెలాక్సీ A36 5Gపై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy A36 5G : శాంసంగ్ మిడ్-రేంజ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ భారీ డిస్కౌంటుతో లభిస్తోంది. ఇలా కొన్నారంటే రూ. 6వేలు తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- May 13, 2026 / 11:08 AM IST
Samsung Galaxy A36 5G : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. శాంసంగ్ మిడ్-రేంజ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A36 5జీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ కోసం ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే. శాంసంగ్ గెలాక్సీ A36 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ కెమెరా ఉన్నాయి.
ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ డీల్స్, ఆఫర్లు ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ A36 5జీ డిస్కౌంట్, ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ 8GB/128GB వేరియంట్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 28,999 ధరకు లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 32,999 ధరకు లాంచ్ అయింది.
బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ధర రూ. 1,920 తగ్గింపుతో ధర రూ. 27,079కు కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 5,920 తక్కువకు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్ 2340x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67-రేటింగ్ అందిస్తుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో సెన్సార్లలో యాక్సిలరోమీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్ వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సింగ్ ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A36 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 5MP మాక్రో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. కొలతల పరంగా ఈ ఫోన్ 162.9 మిమీ పొడవు, 78.2 మిమీ వెడల్పు, 7.4 మిమీ మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది.
