Samsung Galaxy A37 5G : అమెజాన్‌లో శాంసంగ్ 5G ఫోన్ బంపర్ ఆఫర్.. ఈ డీల్ మిస్ అయితే మళ్లీ దొరకదు బ్రో..!
Samsung Galaxy A37 5G : వారెవ్వా.. భలే ఉందిగా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అమెజాన్ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Updated on- May 20, 2026 / 07:07 PM IST
Samsung Galaxy A37 5G ( Image Credit : AI )
- శాంసంగ్ గెలాక్సీ A37 5జీ 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే
- 5,000mAh బ్యాటరీ, ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ సెటప్
- 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాలు
Samsung Galaxy A37 5G : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. అమెజాన్ శాంసంగ్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ 2026 మార్చిలో గెలాక్సీ A37 5జీ ఫోన్ లాంచ్ చేసింది.
ప్రస్తుతం ఈ సౌత్ కొరియన్ ఫోన్ భారీ డిస్కౌంట్లతో లభిస్తోంది. గెలాక్సీ A37 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఆఫర్లు, ధర వంటి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ తగ్గింపు, ధర :
ఈ గెలాక్సీ A37 5జీ ఫోన్ 8GB+128GB వేరియంట్ అమెజాన్‌లో రూ. 30,990 ధరకు లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 2026లో రూ. 41,999 ధరకు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 5శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 929) తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 30,061 అవుతుంది. లాంచ్ ధర కన్నా దాదాపు రూ. 11,938 తక్కువకే కొనేసుకోవచ్చు.
Read Also : Moto G37 Series : మోటోరోలా నుంచి 2 కొత్త 5G ఫోన్లు.. 50MP కెమెరా, 5200mAh బ్యాటరీ అదుర్స్.. ధర జస్ట్ ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై వన్ యూఐ 8.5తో రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ పొడవు 162.9 మి.మీ, వెడల్పు 78.2 మి.మీ, మందం 7.4 మి.మీ, బరువు 196 గ్రాములు ఉంటుంది.
రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్2.2 అపర్చర్‌తో 5MP మాక్రో కెమెరా, ఎఫ్2.4 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, GPS, Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
