Samsung Galaxy A57 5G : కొత్త శాంసంగ్ గెలాక్సీ A57 5G కొనాలా? పిక్సెల్ 10, ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ కొనాలా? ఈ 3 ఫోన్లలో ఏది బెటర్?

Samsung Galaxy A57 5G : శాంసంగ్, గూగుల్ పిక్సెల్ 10, ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీలకు పోటీగా శాంసంగ్ గెలాక్సీ A57 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy A57 5G

  • శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌ సపోర్టు
  • గూగుల్ పిక్సెల్ 10, గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌ ఆప్షన్
  • ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌

Samsung Galaxy A57 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లో కొత్త శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 10, ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ ఫోన్లకు పోటీగా నిలుస్తోంది. ఈ శాంసంగ్ 5జీ మోడల్ ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌తో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌కు సపోర్టు ఇస్తుంది.

ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, గూగుల్ పిక్సెల్ 10, ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ ఫోన్లలో ఏ ఫోన్ కొంటే బెటర్? ఫీచర్లు, ధర వివరాలపై వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, గూగుల్ పిక్సెల్ 10, ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 56,999 కాగా, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 62,499గా ఉంది. గూగుల్ పిక్సెల్ 10 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,990గా ఉంది . ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999గా ఉంది.

డిస్‌ప్లే, రిజల్యూషన్ :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 1080×2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 60-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల యాక్చువా OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.32-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

Read Also : Vivo X300 Ultra : వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త వివో X300 అల్ట్రా వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు లీక్..

శాంసంగ్ 5జీ ఫోన్ ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌ :
గూగుల్ పిక్సెల్ 10 గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఒప్పో రెనో 15 ప్రో మినీ 5G ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌ సపోర్టుతో పనిచేస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్ :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐపై రన్ అయితే, గూగుల్ పిక్సెల్ 10 ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16పై వర్క్ అవుతుంది.

కెమెరా సెటప్ :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 5MP మాక్రో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. పిక్సెల్ 10 బ్యాక్ సైడ్ ఎఫ్/1.7 అపర్చర్‌తో 48MP వైడ్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/3.1 అపర్చర్‌తో 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. పిక్సెల్ 10లో ఎఫ్/2.2 అపర్చర్‌తో 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

గెలాక్సీ A57 5జీలో కనెక్టివిటీ ఆప్షన్లు :
GPS, 5G, Wi-Fi, బ్లూటూత్ 6.0, USB టైప్-C పోర్ట్, NFC ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10 Wi-Fi 6E, బ్లూటూత్ v6, NFC, GPS, 5G, USB టైప్-C 3.2 పోర్ట్‌ కూడా ఉంది. ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ, బ్లూటూత్, Wi-Fi, NFC, USB టైప్-C పోర్ట్‌ను అందిస్తుంది.

ఫోన్ కొలతలు :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 161.5 మిమీ పొడవు, 76.8 మిమీ వెడల్పు, 6.9 మిమీ మందం, 179 గ్రాముల బరువు ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 152.8 మిమీ పొడవు, 72 మిమీ వెడల్పు, 8.6 మిమీ మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది. ఒప్పో రెనో 15 ప్రో మినీ 5జీ ఫోన్ 151.21 మిమీ పొడవు, 72.42 మిమీ వెడల్పు, 7.99 మిమీ మందంతో 187 గ్రాముల బరువు ఉంటుంది.