Samsung Galaxy Quantum 7 : కొత్త శాంసంగ్ ఫోన్ అదరహో.. 50MP ట్రిపుల్ కెమెరాతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ధర జస్ట్..!

Samsung Galaxy Quantum 7 : శాంసంగ్ గెలాక్సీ క్వాంటమ్ 7 ఫోన్ లాంచ్ అయింది. ఈ కొత్త ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరాలతో 120Hz అమోల్డ్ స్క్రీన్ అందిస్తుంది. ధర ఎంత ఉంటుందో తెలుసా?

Samsung Galaxy Quantum 7

  • 6.7 అంగుళాల భారీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
  • ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది
  • 12MP ఫ్రంట్ కెమెరా, 50MP OIS సెన్సార్

Samsung Galaxy Quantum 7 : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ క్వాంటం 7 ఫోన్ వచ్చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. కంపెనీ సొంత ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు అనేక ఇతర ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ క్వాంటం 7 ధర :

శాంసంగ్ గెలాక్సీ క్వాంటమ్ 7 దక్షిణ కొరియాలో లాంచ్ అయింది. సియోల్ ఎకనామిక్ డైలీ ప్రకారం.. ఈ ఫోన్ ధర KRW 717,200 (సుమారుగా రూ. 49,600)గా ఉంది. ఈ ఫోన్ ఆసమ్ గ్రే, ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ లైలాక్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ SK టెలికాం ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Jio IPO SEBI : జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.37,700 కోట్ల మెగా ఇష్యూకు లైన్ క్లియర్!

శాంసంగ్ గెలాక్సీ క్వాంటం 7 స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. శాంసంగ్ గెలాక్సీ క్వాంటమ్ 7 ఫోన్‌లో భారీ 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫుల్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. ఈ ఫోన్ వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. శాంసంగ్ ఇందులో సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఎరేజర్, బెస్ట్ ఫేస్, ఎడిట్ సజెషన్స్ వంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. :
శాంసంగ్ గెలాక్సీ క్వాంటమ్ 7 ఫోన్ 3 రియర్ కెమెరాలతో వస్తుంది. మెయిన్ కెమెరా 50MP OIS సెన్సార్ కాగా, 12MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. మూడో కెమెరా 5MP మాక్రో లెన్స్ ఉంది. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ క్వాంటం 7 ఫోన్ ఎక్సినోస్ 1680 చిప్‌సెట్‌తో వస్తుంది. కంపెనీ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. సుమారు 2 రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇతర ఫీచర్లలో నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ కూడా ఉంది.

కంపెనీ ఈ ఫోన్‌ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. అందుకే IP68 రేటింగ్ ఇచ్చింది. ఈ ఫోన్‌లో ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్ సపోర్ట్ ఉంది. 6 ఏళ్ల OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని చెబుతున్నారు. ఈ ఫోన్ వాస్తవానికి గెలాక్సీ A57 5G రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు.