×
Ad

Samsung Galaxy S24 : వారెవ్వా.. భలే డిస్కౌంట్ బ్రో.. రూ. 75వేల శాంసంగ్ ఫోన్ జస్ట్ రూ. 38,957కే.. త్వరపడండి..!

Samsung Galaxy S24 : శాంసంగ్ ఫోన్ అభిమానులకు అదిరే ఆఫర్.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర తగ్గింపు పొందింది. ఈ అద్భుతమైన డీల్ ఇలా పొందండి.

Samsung Galaxy S24

Samsung Galaxy S24 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం శాంసంగ్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్‌ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.35వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే కెమెరాలు, అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

భారత మార్కెట్లో రూ.74,999 ధరకు లాంచ్ (Samsung Galaxy S24) అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు రూ.40వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదనపు బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అమెజాన్‌లో అత్యల్ప ధరకు గెలాక్సీ S24 5జీ ఫోన్ ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ రూ.39,999కు లిస్ట్ అయింది. అసలు లాంచ్ ధర రూ.74,999 నుంచి రూ.35,000 భారీగా తగ్గింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. కొనుగోలుదారులు రూ.1,042 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా ధర రూ.38,957కి తగ్గుతుంది.

ఈ-కామర్స్ బ్రాండ్ నెలకు కేవలం రూ.1,939 నుంచి ఈజీ EMI ఆప్షన్లను కూడా అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌‌పై కండిషన్, బ్రాండ్ మోడల్ ఆధారంగా రూ.37,500 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాదు.. కస్టమర్‌లు ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా ప్రొటెక్షన్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. మీ ఫోన్‌కు ఏదైనా నష్టం లేదా హార్డ్‌వేర్ లోపాల నుంచి లాంగ్ టైమ్ ఆప్షన్ అందిస్తుంది.

Read Also : Income Tax : టాక్స్ పేయర్లకు బిగ్ బ్రేకింగ్.. అర్జెంట్‌గా ఈ ముఖ్యమైన పని పూర్తి చేయండి.. లేదంటే భారీగా పెనాల్టీలు తప్పవు..!

శాంసంగ్ గెలాక్సీ S24 స్పెసిఫికేషన్లు :

శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. మెరుగైన అవుట్‌డోర్ విజిబిలిటీ, మల్టీమీడియా వినియోగం కోసం 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంది. 8GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీ కలిగి ఉంది. యాప్‌, గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేసినా లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారంగా శాంసంగ్ వన్ యూఐ 8 కలిగి ఉంది. ఈ బ్రాండ్ లాంగ్ టైమ్ OS అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. అయితే, ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ కూడా కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 మల్టీఫేస్ ట్రిపుల్-లెన్స్ సెటప్‌ను అందిస్తుంది. ఇందులో OIS 8K వీడియో క్యాప్చర్‌తో 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ పోర్ట్రెయిట్‌లు, వీడియో కాల్స్ కోసం 12MP సెల్ఫీ షూటర్ కలిగి ఉంది.