Samsung Galaxy S25 5G : రూ.80,999 శాంసంగ్ 5G ఫోన్ జస్ట్ రూ.52,249కే.. బ్యాంక్ ఆఫర్‌తో కొంటే ఇంకా చౌక!
Samsung Galaxy S25 5G : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 5జీపై భారీ ఆఫర్ అందిస్తోంది. రూ.80,999 ఫోన్ రూ.52,249కే లభిస్తోంది.. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- November 3, 2026 / 02:28 PM IST
Samsung Galaxy S25 5G
- ఈ శాంసంగ్ 5జీలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్
- 12MP సెల్ఫీ కెమెరా, 4,000mAh బ్యాటరీతో వస్తుంది
- 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999 లిస్టింగ్
Samsung Galaxy S25 5G : దీపావళి పండుగ వేళ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో భాగంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S25 5జీపై భారీ ఆఫర్ అందిస్తోంది.
అంటే.. ఏకంగా రూ.28,750 వరకు ధర తగ్గింపు అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుదారులకు ఇదే బెస్ట్ టైమ్.. ఇంతకీ ఈ అదిరిపోయే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 5జీ ధర, ఆఫర్లు :
ఈ ఫోన్ 12GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు లాంచ్ ధర రూ.80,999కు లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.54,999కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే.. మరో రూ.2,750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
దాంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.52,249కు లభిస్తుంది. అంతేకాదు, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.40,400 వరకు అదనపు బెనిఫిట్ పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. OISతో 50MP ప్రైమరీ కెమెరా, 10MP అల్ట్రావైడ్, 12MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. 4,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 7తో రన్ అవుతుంది. కనెక్టివిటీలో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.4, NFC, Wi-Fi, యూఎస్‌బీ టైప్-సి 3.2 ఉన్నాయి. 162 గ్రాముల బరువు, 7.2 మి.మీ మందంతో ప్రీమియం డిజైన్ అందిస్తుంది.
