Samsung Galaxy S25 Plus 5G : ఈ శాంసంగ్ ఫోన్ హాఫ్ రేటుకే వస్తోంది.. రూ. లక్ష ఖరీదైన ఫోన్ కేవలం రూ. 50వేల లోపే..!
Samsung Galaxy S25 Plus 5G : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు రూ.99వేలకు పైగా ఉన్నా ఈ శాంసంగ్ ఫోన్ ఇప్పుడు రూ. 50వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published On : March 28, 2026 / 02:25 PM IST
Samsung Galaxy S25 Plus 5G : శాంసంగ్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి. శాంసంగ్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5జీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అసలు ధర రూ. 99,999 నుంచి రూ. 74,999కి తగ్గింది.
బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 50వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. 2026లో ఈ శాంసంగ్ ఫోన్ కొనేందుకు 3 కారణాలు ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నా? లేదా పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని అనుకుంటున్నా ఈ ఆఫర్ మీకోసమే..
శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S25 ప్లస్ 5Gపై సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాట్ 25శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేదు. అన్ని ఆఫర్ల తర్వాత రూ. 50వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రూ. 35,000 వరకు డిస్కౌంట్ : శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5జీ ఫోన్ (12GB + 256GB) అసలు ధర రూ. 99,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,999కే అందుబాటులో ఉంది. దాంతో ఈ ఫోన్ వాల్యూ ఫ్లాట్ 25శాతం తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 3,750 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డివైస్‌పై రూ. 47,350 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. ఎక్స్ఛేంజ్ బోనస్ మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్, పిన్ కోడ్ ఆధారంగా ఉంటుంది. మీరు ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ. 25,000 తగ్గింపు పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5జీ ఫోన్ రూ. 50వేల కన్నా తక్కువకే కొనేసుకోవచ్చు.
ఈ శాంసంగ్ కొనేందుకు 3 కారణాలివే : 2026లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ 5జీ తగ్గింపు ధరకే లభిస్తోంది. హై పర్ఫార్మెన్స్, లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు, అడ్వాన్స్ బిగ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. 7 ఏళ్ల OS, సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.
మరో 2 ఏళ్ల వరకు అప్‌డేట్స్ అందుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏఐ సూట్బో బ్రీఫ్, ఆడియో ఎరేజర్, సర్కిల్ టు సెర్చ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లోనే 65శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.
