Samsung Galaxy S25 Ultra 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5Gపై రూ. 37,510 తగ్గింపు.. అమెజాన్‌లో జస్ట్..!

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ ఫ్యాన్స్ పండగ చేస్కోండి. 2025లో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. అమెజాన్ ఇలా కొనేసుకోవచ్చు.

Samsung Galaxy S25 Ultra 5G

  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ధర రూ. 37,510 తగ్గింపు
  • ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 98,489గా ఉంది.
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 200MP క్వాడ్ కెమెరా
  • 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ సెటప్

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్.. అమెజాన్ ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీ ధర తగ్గింపుతో లభిస్తుంది. శాంసంగ్ 2025 ఫ్లాగ్‌షిప్ ఫోన్, లాంచ్ అయిన ఏడాది తర్వాత కూడా అద్భుతమైన డీల్‌ అందిస్తోంది. మీరు హై పర్ఫార్మెన్స్ హార్డ్‌వేర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే ఈ అదిరిపోయే ఫోన్ అసలు మిస్ చేసుకోవద్దు.

రూ. 1,29,999కి లాంచ్ కాగా గెలాక్సీ S25 అల్ట్రా ఇప్పుడు అమెజాన్‌లో (Samsung Galaxy S25 Ultra 5G) అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అందించిన తగ్గింపు కన్నా చాలా తక్కువ అనమాట..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ. 37,510 తగ్గింది. 12GB + 256GB వేరియంట్ రూ. 92,489కే లభిస్తోంది. అమెజాన్ జీఐఎఫ్ 2025 సేల్‌లో S25 అల్ట్రా ధర రూ. 99,999కి తగ్గింది.

టైటానియం వైట్‌సిల్వర్, టైటానియం సిల్వర్‌బ్లూ కలర్లు మాత్రమే రూ. 92,489కే లభిస్తున్నాయి. టైటానియం బ్లాక్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లు వరుసగా రూ. 93,899, రూ. 93,000 ధరలకు లభిస్తున్నాయి.

Read Also : BSNL Recharge Plan : BSNL చీపెస్ట్ ప్లాన్.. రోజుకు 3GB డేటా, 365 రోజులు ఫుల్ మజా..!

గెలాక్సీ S25 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, ప్రైవసీ డిస్‌ప్లే కన్నా అద్భుతంగా ఉంటుంది.

IP68 సర్టిఫికేషన్‌ అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం అందిస్తుంది. ఈ S25 అల్ట్రా ఆక్టా-కోర్ సీపీయూతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ద్వారా రన్ అవుతుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ అందిస్తుంది. వన్ యూఐ8పై రన్ అవుతుంది.

5,000mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు OIS, EIS సపోర్ట్‌తో 10-బిట్ HDRలో 120FPS వద్ద 8K, 4K రిజల్యూషన్‌లో రికార్డ్ చేయొచ్చు.